AP Govt: ‘వేస్ట్ మేనేజ్‌మెంట్’పై కీలక ఒప్పందం
ABN, Publish Date - Apr 29 , 2025 | 08:54 PM
AP Govt: రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వేస్ట్ మేనేజ్‌మెంట్ పై కీలక ఒప్పందం కుదిరింది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, ఐటీసీతోపాటు రెల్డాన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొంది.
అమరావతి; ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్‌లోని 30 మున్సిపాలిటీలు, కార్పొరేషనల్లో వేస్ట్ మేనేజ్‌మెంట్‌కి సహకారాన్ని అందించేందుకు ఐటీసీ కంపెనీ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని సీడీఏంఏ (కమీషనర్ అండ్ డైరెక్టరేట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్) కార్యాలయంలో ఐటీసీతో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొంది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మా రెడ్డి పట్టాభిరామ్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పంద పత్రాలపై ఐటీసీ, రెల్డాన్ సంస్థ ప్రతినిధులు సంతకాలు చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతోపాటు పిఠాపురం, ఒంగోలు,తిరుపతి, కడప, మంగళగిరి తదితర 30 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దత్తత తీసుకునీ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో తన సహాకారాన్ని ఐటీసీ కంపెనీ అందించనుంది. ఈ మున్సిపాలిటీల్లో "wow" (well being out of waste)కార్యక్రమం చేపట్టి వేస్ట్ సెగ్రిగేషన్ మీద ప్రజలలో అవగాహన పెంపొందించడానికి పలు కార్యక్రమాలను ఐటీసీ కంపెనీ చేపట్టనుంది. రాష్ట్రంలో "ఈ - వేస్ట్"(ఎలక్ట్రానిక్ వేస్ట్)నీ సేకరించి.. దానిని రెల్డాన్ సంస్థ ప్రాసెస్ చేయనుంది. పైలట్ ప్రాజెక్టు కింద విజయవాడలో ఐదు వేల అడుగుల విస్తీర్ణంలో "ఈ వేస్ట్" సేకరణ కేంద్రం "రెల్డాన్" సంస్థ ప్రారంభించనుంది.
ఇవి కూడా చదవండి
Gorantla Madhav: ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకొంటున్న ప్రజలు
Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
For More AP News and Telugu News
Updated Date - Apr 29 , 2025 | 08:54 PM