ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Nimmala Rama Naidu : జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు

ABN, Publish Date - Jan 28 , 2025 | 04:06 AM

సోమవారం విజయవాడలోని జల వనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో పోలవరం ఎడమ కాలువ పనులపై ఆయన సమీక్ష జరిపారు.

  • పోలవరం ఎడమ కాలువ టెండర్ల ప్రక్రియ పూర్తి

  • ప్యాకేజీలకు ఆమోదం.. రూ.3,198 కోట్ల

  • విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగింత

  • జూన్‌కల్లా పూర్తిచేసేందుకు ఒప్పందం

  • 2027 డిసెంబరుకల్లా ప్రాజెక్టు నిర్మాణం: నిమ్మల

అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రకు వచ్చే జూలై నాటికి గోదావరి జలాలను తరలిస్తామని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. సోమవారం విజయవాడలోని జల వనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో పోలవరం ఎడమ కాలువ పనులపై ఆయన సమీక్ష జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలవరం ఎడమ కాలువ టెండర్ల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. టెండర్లు ఖరారైన ఏజెన్సీలన్నీ జూలై నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘2019లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే పోలవరం పూర్తయ్యేది. 17 నెలలపాటు జగన్‌ ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థ లేకుండా చేయడంతో.. 2020 వరదల్లో డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలోగా పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల ద్వారా పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి నీటిని తరలించాలన్న సీఎం చంద్రబాబు కృతినిశ్చయంతో ఉన్నారు.


ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పునఃప్రారంభిస్తాం. పోలవరం ఇంజనీరింగ్‌ అధికారులు, ఏజెన్సీలతో జరిపిన సమీక్షలో మొదటి ప్యాకేజీ నుంచి ఎనిమిదో ప్యాకేజీ వరకూ ఇరిగేషన్‌, రెవెన్యూ, నేషనల్‌ హైవే, విద్యుత్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖలన్నింటి మధ్య సమన్వయం ఉండాలని ఆదేశించాం. భూసేకరణ, పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నాం. పనులు ఏరోజుకారోజు తెలుసుకునేలా రియల్‌టైమ్‌ వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నాం’ అని చెప్పారు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల కాంటూరు.. 45.72 మీటర్ల కాంటూరుగా విభజించి.. తొలి, మలిదశ అంటూ నివేదికలు పంపి.. ఆమోదం పొందారని చెప్పారు. ఇప్పుడు తప్పు జరిగిపోతోందంటూ సొంత పత్రికలో గగ్గోలు పెడుతూ కథనాలు ప్రచురించడం హస్యాస్పదంగా ఉందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 04:06 AM