ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt: రాష్ట్ర తలసరి ఆదాయం 2,68,653

ABN, Publish Date - Mar 04 , 2025 | 04:54 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక సర్వేను సోమవారం విడుదల చేసింది.

  • జాతీయ సగటు కంటే మన దగ్గర రూ.68 వేలు అధికం

  • కూటమి ప్రభుత్వంలో పెరిగిన జీవన ప్రమాణాలు

  • అదుపులోకి నిత్యావసరాల ధరలు.. తేల్చిన సామాజిక ఆర్థిక సర్వే

  • 2024-25లో వృద్ధిరేటు 12.49%.. జీఎ్‌సడీపీ 16 లక్షల కోట్లు

  • అతి పేద జిల్లా కర్నూలు.. ధనిక జిల్లా పశ్చిమ గోదావరి

అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక సర్వేను సోమవారం విడుదల చేసింది. ఇందులో వృద్ధిరేటు, జీఎ్‌సడీపీ అంచనాలు, రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల గురిం చి వివరించారు. 2024-25 ముందస్తు అంచనాల ప్రకారం 12.94ు వృద్ధిరేటుతో రూ.16.06 లక్షల కోట్ల జీఎ్‌సడీపీ నమోదవుతుందన్నారు. 2024- 25లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,68,653కు చేరుతుందని అంచనా వేశారు. జాతీయసగటు రూ.2,00,162 కంటే ఎక్కువ ఇది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని తే ల్చారు. ధరల నియంత్రణకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలను సర్వే ప్రస్తావించింది. ‘‘2024- 25లో ఉల్లి ధరలు 40.24 శాతం పెరిగాయి. కానీ, ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్లో ధరలను నియంత్రించింది. ఇందుకోసం రైతుల నుంచి నేరు గా కొనుగోలు చేయడం, కోల్డ్‌స్టోరేజ్‌ కేంద్రాల నుం చి సేకరించింది’’ అని పేర్కొంది. ఈ నెల 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాలను ఈ సర్వేలో అందించారు.


సర్వేలో ముఖ్యమైన అంశాలు

  1. వ్యవసాయం రంగంలో 15.86 శాతం వృద్ధిరేటుతో రూ.5.19 లక్షల కోట్ల జీవీఏ, పారిశ్రామిక రంగంలో 6.71 శాతం వృద్ధిరేటుతో రూ.3.41 లక్షల కోట్ల జీవీఏ, సేవా రంగంలో 11.7 శాతం వృద్ధిరేటుతో రూ.6.11 లక్షల కోట్ల జీవీఏ నమోదవుతుందని అంచనా.

  2. హార్టికల్చర్‌, పశుసంవర్ధకం, మత్స్యరంగాల్లో వృద్ధి గణనీయంగా ఉంటుంది. పారిశ్రామిక రంగంలో ఉత్పాదక విభాగంలో 6.57% వృద్ధి, నిర్మాణ రంగంలో 10.47%, సేవా రంగంలో కమ్యూనికేషన్స్‌ విభాగంలో 15.28ు, బ్యాంకింగ్‌, బీమా రంగాల్లో 14.6% వృద్ధిని అంచనా వేశారు.

  3. 2024-25లో తలసరి ఆదాయం రూ.2,68,653కు చేరుతుందని అంచనా.

  4. 2024-25లో సొంత పన్నుల ఆదాయం రూ.94,967 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.7018 కోట్లు, కేంద్ర నుంచి నిధుల బదిలీ ద్వారా రూ.89,157 కోట్లు వస్తున్నట్టు చెప్పారు.

  5. 2023-24లో వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులు, తిరి గి చెల్లించిన అప్పుల అసలు మినహాయిస్తే రా ష్ట్రం మొత్తం ఖర్చు రూ.2,36,512 కోట్లు. 2024-25లో ఈ ఖర్చు రూ.2,49,418 కోట్లకు చే రుతుందని అంచనా. 2023-24లో రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పు రూ.4,91,734 కోట్లు కాగా 2024- 25 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల ప్రకారం రూ.5,64,488 కోట్లకు చేరుతుంది.

  6. 2023-24లో రూ.38,683 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. బడ్జెట్‌ లోటు రూ.62,720 కోట్లు ఉంది. 2024-25లో రెవెన్యూ లోటు రూ.48,311 కోట్లు, బడ్జెట్‌ లోటు రూ.73,362 కోట్లకు పెరుగుతోంది.

  7. పారిశ్రామిక రంగంలోని ఉద్యోగులకు, వ్యవసా య కూలీల వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) పెరుగుతూ ఉంది. దీని అర్థం జీవన వ్యయం పెరగడం. పారిశ్రామిక ఉద్యోగుల సీపీఐ 4.89 శాతం పెరిగింది.


8.వ్యవసాయ కూలీలకు కూలీలు పెరిగాయి. వ్యవసాయ కూలీల్లో మగవారికి సగటున వారి రోజువారీ భత్యం 5.65 శాతం పెరిగి రూ.561కి చేరుకుంది. మహిళా కూలీల వేతనం 2.58 శాతం పెరిగి రూ.398కి చేరుకుంది.

9. వడ్రంగి, కమ్మరి వృత్తుల వారి భత్యాలు పెరిగాయి. వడ్రంగుల ఆదాయం 7.74 శాతం పెరిగి రూ.710కి చేరుకుంది. చెప్పులు కుట్టే వారి ఆర్జనలో స్వల్ప క్షీణత ఉంది.

10.జనసాంద్రత ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికంగా ఉంది. 2011లో ఒక చదరపు కిలోమీటర్‌కు ఈ జిల్లాలో 304 మంది నివసించారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు518 మంది నివసిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు సర్వే గుర్తించింది. చాలీచాలని రుణ సౌకర్యం వల్ల వ్యవసాయ రంగం సవాళ్లను చవిచూస్తున్నదని తేల్చింది. కూటమి ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో 30% వృద్ధి సాధించే లక్ష్యంతో ముందడుగు వేస్తోందని తెలిపింది.


ఎంపీఐ స్కోర్‌లో 9వ స్థానం

రాష్ట్రంలోనే అత్యధిక పేదరికం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ప్రకా శం, అనంతపురం జిల్లాలున్నాయి. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, శ్రీకాకు ళం జిల్లాలు తక్కువ పేదరికంలో ఉన్నాయి. సామాజిక ఆర్థిక సర్వేలో హెడ్‌కౌంట్‌ నిష్పత్తి, మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌(ఎంపీఐ) స్కోర్‌ వివరాలను తెలిపారు. పౌష్టికాహారం, పుట్టిన పిల్లల జనన, మరణాలు, గర్భిణుల ఆరోగ్యం పరిగణనలోకి తీసుకుని ఎంపీఐని లెక్కించారు. తక్కువ ఎంపీఐ స్కోరు కలిగిన రాష్టాల్లో ఏపీ 9వ స్థానంలో ఉంది.

పింఛన్లకు 2,717 కోట్లు ఖర్చు

రాష్ట్రంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కింద కూటమి సర్కారు నెలకు రూ.2,717 కోట్లు ఖర్చు చేస్తోందని సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడించారు. బీసీల్లో అత్యధికంగా నెలనెలా 28.60 లక్షల మం ది పింఛన్లు పొందుతున్నారు. ఆ తర్వాత ఎస్సీలు సుమారు 11.45 లక్షల మంది, కాపులు 6.91 లక్షలు, ఎస్టీలు 3.77 లక్షలు, ముస్లింలు 3.18 లక్షలు, రెడ్లలో 2.92 లక్షలు, కమ్మలో 2.63 లక్ష లు, ఈబీసీలు 65,638, బ్రాహ్మణులు 47,707, క్షత్రియులు 41,201, వైశ్యులు 84,345, క్రైస్తవులు 11,458 మంది పింఛన్లు పొందుతున్నారు.

Updated Date - Mar 04 , 2025 | 04:54 AM