ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Premier League: బిడ్లు పిలవండి.. ఖరారు చేయొద్దు

ABN, Publish Date - Jun 08 , 2025 | 04:24 AM

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌లో ఫ్రాంచైజీని సొంతం చేసుకొనేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ఈ ఏడాది జూన్‌ 2న ఏసీఏ, ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ప్రకటన జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ వైజాగ్‌ వారియర్స్‌...

  • ఏసీఏ, ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌కు హైకోర్టు ఆదేశం

అమరావతి, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌లో ఫ్రాంచైజీని సొంతం చేసుకొనేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ఈ ఏడాది జూన్‌ 2న ఏసీఏ, ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ప్రకటన జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ వైజాగ్‌ వారియర్స్‌, కోస్టల్‌ రైడర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఉత్తరాంధ్ర లయన్స్‌, బెజవాడ టైగర్స్‌ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇప్పటికే ఉన్న ఒప్పందాలను పట్టించుకోకుండా కొత్త ఫ్రాంచైజీల కోసం టెండర్‌ పిలవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నాయి. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి ఇటీవల విచారణ జరిపారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. వ్యాజ్యంపై లోతైన విచారణ అవసరమని అభిప్రాయడ్డారు. కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర క్రీడాశాఖ ముఖ్యకార్యదర్శి, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి, ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌, బీసీసీఐ కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు. ఫ్రాంచైజీల కోసం ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించి, వాటిని తెరవచ్చని, అయితేవాటిని ఖరారు చేయవద్దని ఏసీఏ, ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ను ఆదేశించారు.

Updated Date - Jun 08 , 2025 | 04:28 AM