ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Temple Lands: వేలం లేకుండానే లీజు

ABN, Publish Date - May 13 , 2025 | 05:01 AM

ఆలయాల భూముల లీజు నియమాలను మార్చే ప్రసంగాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. భూములను ఎక్కువ కాలం, ఎన్నో సంస్థలకు లీజు ఇవ్వాలని చట్ట సవరణ చేస్తూ, 11 ఏళ్ల లీజు కాలాన్ని 33 ఏళ్లకు పెంచే ప్రతిపాదన దాఖలు చేసింది.

చౌకగా ఆలయాల వ్యవసాయేతర భూములు

ప్రస్తుతం వేలం ద్వారా 11 ఏళ్ల వరకూ లీజు

వేలం లేకుండా 33 ఏళ్ల వరకూ భూములు కట్టబెట్టేలా దేవుడి చట్ట సవరణకు నిర్ణయం

ఆలయాల ఆదాయానికీ గండిపడే ప్రమాదం

ప్రాథమిక నోటిపికేషన్‌ జారీ

ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి ప్రతిపాదనలు

దేవదాయ ఉన్నతాధికారుల తీరుపై అభ్యంతరాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దైనా చట్ట సవరణ చేస్తే నిబంధనలు మరింత పకడ్బందీగా ఉండేలా మారుస్తారు. ఆస్తులకు సంబంధించిన చట్టమైతే వాటికి మరింత రక్షణ కల్పించేలా ప్రతిపాదనలు చేస్తారు. అయితే దేవదాయ, ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆలయాలకు సంబంధించిన వ్యవసాయేతర భూములరక్షణకు పారదర్శకంగా ఉన్న చట్టంలోని నిబంధనలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వేలం లేకుండా భూములను ఆయా సంస్థలకు లీజుకు అప్పగించి, ఎంత లీజు ఇస్తే అంత తీసుకునేలా సరికొత్త నిబంధనలు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం వేలం ద్వారా 11 ఏళ్ల వరకూ మాత్రమే లీజుకు ఇచ్చే అధికారం ఉండగా, ఏకంగా 33 ఏళ్ల వరకూ కూడా లీజు ఇచ్చే విధంగా సవరణ తీసుకొస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ చారిటబుల్‌ అండ్‌ హిందూ రిలీజియన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్‌ చట్టం-1987కు సవరణ చేయాలని నిర్ణయించారు. చట్ట సవరణకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌కు ఆ శాఖ కార్యదర్శి వి.వియన్‌ చంద్‌ ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేసేశారు. చట్ట సవరణపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలియజేయాలని సూచించారు. ప్రస్తుతం దేవదాయ శాఖ ఏదైనా సంస్థకు లేదా వ్యక్తికి భూములు కేటాయించాలంటే 2003 చట్టంలోని నిబంధనలు పాటిస్తున్నారు.


ఆ నిబంధనల ప్రకారం భూముల కేటాయింపునకు కచ్చితంగా వేలం నిర్వహించాలి. వేలంలో ఎవరు ఎక్కువకు పాడుకుంటే వారికి మాత్రమే భూములు కేటాయిస్తున్నారు. ఎలాంటి దాపరికాలూ లేకుండా దేవదాయ శాఖ అధికారికంగా బహిరంగ వేలం నిర్వహిస్తోంది. వేలం అనంతరం లీజుదారుడు ముందస్తుగా డబ్బులు చెల్లిస్తేనే కేటాయింపులు చేస్తారు. పైగా 11 సంవత్సరాల వరకు మాత్రమే లీజుకు ఇచ్చే అధికారం దేవదాయ శాఖ కమిషనర్‌కు ఉంది. పదకొండేళ్లకుపైగా సెంటు భూమి లీజుకు ఇవ్వాలన్నా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ భూములు అమ్మాలన్నా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హైకోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రజాప్రయోజనాల కోసం చేస్తున్నారంటేనే హైకోర్టు అనుమతి ఇస్తుంది. కానీ, 2003కు ముందు అధికారులు వేల ఎకరాల భూములను అడ్డగోలుగా అమ్మేశారు. ఇలా వదిలేస్తే దేవుడి భూములు మిగలవని నేరుగా హైకోర్టు జోక్యం చేసుకుంది. హైకోర్టు అనుమతి లేకుండా సెంటు భూమి కూడా అమ్మడానికి లేదు. లీజులు, లైసెన్సులు మాత్రం ఆంధ్రప్రదేశ్‌ చారిటబుల్‌ అండ్‌ హిందూ రిలీజియన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్‌ చట్టం-1987కు 2003లో చేసిన సవరణల ప్రకారం చేసుకునే వెలుసుబాటు కల్పించింది. హైకోర్టు జోక్యం ఆ అధికారులకు తీవ్ర అడ్డంకిగా మారింది. వారు అనుకున్న సంస్థలకు భూములు దక్కడం లేదు. పైగా వేలం పెద్ద సమస్యగా మారింది. దీంతో చట్ట సవరణకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వాన్ని కూడా తప్పుదారి పట్టించి చట్ట సవరణకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించారు. దీనికి ప్రభుత్వం కూడా ప్రాథమిక నోటిపికేషన్‌ జారీ చేసేసింది.


ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వేల ఎకరాలు

దేవదాయ శాఖ పరిధిలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఆయా ఆలయాలకు చెందినవి. వీటిలో ఆ శాఖ జోక్యం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఆలయాల నిర్వహణ కష్టంగా ఉన్నప్పుడు, ఆలయాల ఉద్ధరణకు, నిర్వహణకు ఎంతోమంది దాతలు దేవుడిపై భక్తితో భూములను ఆలయాలకు ఇస్తారు. ఆ భూములను కేవలం ఆలయాల నిర్వహణకు, అందులో పని చేసే ఉద్యోగులకు జీతభత్యాల కోసం మాత్రమే ఉపయోగించాలి. సంస్థలకు ఆలయ భూములను ఇవ్వడం వల్ల ఆలయానికి ఎలాంటి ఆదాయమూ రాదు. ఇప్పటికే ప్రముఖ ఆలయాలకు చెందిన వేల ఎకరాల వ్యవసాయేత భూములు ప్రైవేటు వ్యక్తుల్లో చేతుల్లో ఉన్నాయి. వాటిని విడిపించడం ఆ శాఖకు తలనొప్పిగా మారింది. ఇప్పుడు మరిన్ని భూ సమస్యలు దేవదాయ శాఖ నెత్తిన పెట్టడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. చట్ట సవరణ జరిగితే ఏ ఆలయానికీ వ్యవసాయేతర భూములు మిగిలే పరిస్థితి ఉండదు. అప్పుడు ఆలయాల నిర్వహణతోపాటు ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది.


చట్ట సవరణ జరిగితే..

దేవదాయ శాఖ ప్రతిపాదించిన చట్ట సవరణ జరిగితే ఆలయాల వ్యవసాయేతర భూములను వేలం లేకుండానే ప్రైవేటు సంస్థలకు కేటాయించొచ్చు. కనీసం 20 ఏళ్లు లాభాపేక్ష లేకుండా, నిత్యం సేవా కార్యక్రమాలు చేయడమే భూమి పొందడానికి ప్రధాన అర్హత. ఈ విషయాన్ని సదరు సంస్థ లేఖ ద్వారా దేవదాయశాఖకు నిర్ధారించాలి. దీనికి సంబంధించిన అకౌంట్స్‌ వివరాలూ అందించాలి. భూములకు ఎంత లీజు చెల్లిస్తారన్న విషయాన్ని కూడా సంస్థ తెలియజేయాల్సి ఉంది. సంస్థ నిర్వహించే కార్యకలాపాల ఆధారంగా కూడా లీజు ఎంతో నిర్ధారిస్తారు. ఎంత అనేది అధికారులే నిర్ణయించేలా సవరణ చేయబోతున్నారు. పైగా 33 ఏళ్ల వరకూ కూడా లీజు ఇచ్చే విధంగా సవరణ తీసుకొస్తున్నారు. ఈ సవరణపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రెండుసార్లు ఈ చట్టాన్ని సవరించారు.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 13 , 2025 | 05:01 AM