ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Liquor Scam: గోవిందప్పను కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు.. అంతలోనే

ABN, Publish Date - May 14 , 2025 | 10:58 AM

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన గోవిందప్ప బాలాజీని కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. అయితే జీబు దించకుండానే గోవిందప్పను మళ్లీ సిట్ అధికారులు బయటకు తీసుకు వెళ్లిపోయారు.

AP Liquor Scam

విజయవాడ, మే 14: మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam) ఏ33గా ఉన్న గోవిందప్ప బాలాజీని (Govindappa Balaji) నిన్న(మంగళవారం) మైసూరులో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈరోజు (బుధవారం) కోర్టులో హాజరుపర్చడానికి ముందుగా గోవిందప్పను సిట్ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి అవడంతో ఆయనను కోర్టు ప్రాంగణానికి పోలీసులు తీసుకువచ్చారు. అయితే జీబు దించకుండానే గోవిందప్పను మళ్లీ సిట్ అధికారులు బయటకు తీసుకు వెళ్లిపోయారు. అంతే కాకుండా జీబులో ఉన్న గోవిందప్పను చిత్రీకరించకుండా పోలీసులు అడ్డుకున్నారు. అతని ముఖం కనిపించకుండా పోలీసులు అడ్డుగా చేతులు పెట్టి దాచిన వైనం చర్చనీయాంశంగా మారింది.


కాగా.. గోవిందప్ప అరెస్ట్‌తో లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్‌ల సంఖ్య ఐదుకు చేరింది. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. చాణక్య, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణ తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను నిందితులుగా చేరూస్తూ సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. వసూళ్ల నెట్వర్క్ ద్వారా వచ్చిన డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించడంలో బాలాజీ తెర వెనుక వ్యవహారం నడిపారని సిట్ అధికారులు భావిస్తున్నారు.


ఈ కేసుకు సంబంధించి ఈనెల 11న విచారణకు రావాల్సిందిగా గోవిందప్పకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కదలికలపై ఆరా తీసిన సిట్ అధికారులు కర్ణాటకలో ఉన్నట్లు గుర్తించారు. చామరాజనగర్‌ జిల్లా యల్లందూరు తాలుకాలోని ఒక అటవీ ప్రాంతంలోని వెల్‌నెస్‌ సెంటర్‌‌లో ఉన్న గోవిందప్పను సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. తాడేపల్లి ప్యాలెస్‌కు మద్యం సొమ్ములు చేర్చడంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్‌ శాశ్వత డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీల పాత్రను సిట్‌ అధికారులు గుర్తించారు. వీరిలో బాలాజీ వృత్తిరీత్యా చార్టర్డ్‌ అకౌంటెంట్‌. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ద్వారా జగన్ కుటుంబానికి దగ్గరైన గోవిందప్ప భారతీ సిమెంట్స్‌తో పాటు జగన్‌, భారతి ఆర్థిక లావాదేవీలను చూసుకునేవారు. ఈ క్రమంలో లిక్కర పాలసీలో మొదటి నుంచి బాలాజీది కీలక పాత్ర అని గుర్తించిన సిట్.. ఆ మేరకు ఆధారాలను కూడా సేకరించింది.


ఇవి కూడా చదవండి

Justice Gavai oath ceremony: సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం

Adampur Airbase: అబద్ధాల ఫ్యాక్టరీ.. పాకిస్థాన్‌

Read Latest AP News And Telugu News

Updated Date - May 14 , 2025 | 02:03 PM