ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati Land Pooling: రాజధాని భూ సమీకరణకు జూలైలోగా నోటిఫికేషన్‌ జారీ

ABN, Publish Date - Jun 25 , 2025 | 05:01 AM

రాజధాని అమరావతి ప్రాంతంలో మరో 40 వేల ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. దీనికిగాను జూలైలోగా నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు

అమరావతి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి ప్రాంతంలో మరో 40 వేల ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. దీనికిగాను జూలైలోగా నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ భూ సమీకరణకు 2015నాటి ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం నిబంధనలు ఉంటాయని, ల్యాండ్‌ పూలింగ్‌ నిబంధనలు-2025ను సీఆర్‌డీఏ నోటిఫై చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. రాజధానిలో భూసమీకరణ కింద తీసుకున్న 34 వేల ఎకరాలు ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే హైదరాబాద్‌ తరహాలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, హోటళ్లు, టూరిజం, క్రీడానగరం, స్మార్ట్‌ పరిశ్రమలు అవసరమని తెలిపారు. వీటివల్ల జీఎస్టీ పెరుగుతుందని, సమాంతరంగా అమరావతి అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. ఇందుకోసం కనీసం 10 వేల ఎకరాలు కావాల్సి ఉందన్నారు. సంబంధిత నిబంధనలను సీఆర్‌డీఏ నోటిఫై చేసి, విధి విధానాలు ఖరారు చేసి, జూలైలోగా నోటిఫికేషన్‌ ఇస్తుందన్నారు. 29 గ్రామాలను ఆనుకుని జాతీయ రహదారికి తూర్పువైపు, కృష్ణానదికి ఇవతల ఉత్తర ప్రాంతం, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు పడమర వైపు ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూ సమీకరణ చేపడతామన్నారు. దీనిపై గ్రామ కమిటీల ద్వారా తీర్మానాలు చేపడతామని, ఎమ్మెల్యేలు, కలెక్టర్లుకు సూచనలు చేశామని వివరించారు.

5 వేల ఎకరాల్లో విమానాశ్రయం: అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయానికి 5వేల ఎకరాలు, అంతర్జాతీయస్థాయి క్రీడా నగరానికి 2,500 ఎకరాలు, స్మార్ట్‌ ఐటీ పరిశ్రమలకు 2,500 ఎకరాల కేటాయిస్తామని తెలిపారు. దీనిలోనే ఉద్యోగుల పిల్లలకు స్కూళ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అమరావతిలో అధికారుల భవనాలు ఏడాదిలోపు, ట్రంక్‌ రోడ్లు ఏడాదిన్నర నుంచి రెండేళ్లలోపు, లేఅవుట్‌ రోడ్లు రెండున్నరేళ్లు, ఐకానిక్‌ టవర్స్‌ నిర్ణీత వ్యవధిలోగా సిద్ధమవుతాయని చెప్పారు. కరకట్ట నాలుగులైన్ల విస్తరణ పనుల విషయంలో కాంక్రీటు వాల్‌ నిర్మాణంపై ఎన్జీటీతో చర్చిస్తున్నామని చెప్పారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు సంబంధించి మిగిలిన భూ సమీకరణపై మంత్రి మండలిలో అనుమతి వచ్చిందని, త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 05:01 AM