ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: ఆగస్టులో అక్షరాంధ్ర

ABN, Publish Date - Jul 03 , 2025 | 03:39 AM

అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది. వెనుకబడిన రాష్ర్టాలుగా భావించే బిహార్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ కూడా ఏపీ కంటే ముందున్నాయి.

ఏటా 25 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చే లక్ష్యం

వయోజనులకు 100 గంటల పాటు శిక్షణ

  • ప్రతి సంవత్సరం సెప్టెంబరు, మార్చిలో పరీక్షలు

  • కేంద్ర పథకం ‘ఉల్లాస్’తో పాటు నిర్వహణకు ప్రణాళిక

  • అక్షరాస్యతలో అట్టడుగున ఆంధ్రప్రదేశ్‌

  • రాష్ట్రంలో 1.2 కోట్ల మంది నిరక్షరాస్యులు

  • వీరిలో 15-59 ఏళ్ల మధ్య వారు 81.14 లక్షలు

  • 59 ఏళ్లు పైబడిన వారు 39.54 లక్షల మంది

  • 2024-25లో 3.95 లక్షల మందికి శిక్షణ

  • వైసీపీ ఐదేళ్ల పాలనలో 3 లక్షల మందికే...

(అమరావతి-ఆంధ్రజ్యోతి): అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది. వెనుకబడిన రాష్ర్టాలుగా భావించే బిహార్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ కూడా ఏపీ కంటే ముందున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 2024 ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఏకంగా 1,20,68,709 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వయోజన విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వీరి సంఖ్య పెరగడానికి ఓ కారణమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా మాతృభాషలో చదవడం, రాయడం లక్ష్యంగా కేంద్ర పథకం ‘ఉల్లాస్’తో కలిసి ‘అక్షరాంధ్ర’ అనే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా 2025-26లో 25లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. స్వయం సహాయక బృందాలు, విద్యార్థులు, ఇతర వలంటీర్ల సహకారంతో వయోజనులకు 100 గంటల పాటు శిక్షణ ఇస్తారు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు, మార్చిలో పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. ఇందుకోసం పుస్తకాల ముద్రణకు వయోజన విద్యా విభాగం టెండర్లు పిలిచింది. ఎక్కువ మందిని అక్షరాస్యులుగా మార్చినవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి.

ఏం నేర్పుతారు?

వయోజన విద్యలో చదవడం (వర్ణమాల, సరళమైన పదాలు, వాక్యాలు, చిత్రాలను చూసి పదాలు గుర్తించడం), రాయడం (తెలుగు అచ్చులు, హల్లులు, ఒత్తులు, గుణింతాలు, చిన్న వాక్యాలు), న్యూమరసీ (న్యూమరసీ- వెయ్యి వరకు అంకెలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలతో పాటు కిలోలు, లీటర్లు, మీటర్ల లాంటి కొలతలపై అవగాహన కల్పిస్తారు), డిజిటల్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ లిటరసీలో భాగంగా గడియారం, క్యాలెండర్‌ను చూసి అర్థం చేసుకోవడం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో డిజిటల్‌ అంకెలను గుర్తించడం, ఏటీఎంలను వినియోగించడం తదితర అంశాలు నేర్పిస్తారు.

అక్షరాస్యత 77 శాతమే

రాష్ట్రంలో 5.25 కోట్ల మంది ప్రజలు ఉండగా వీరిలో అక్షరాస్యులు 4.04 కోట్ల మంది (77ు). మరో 1.2 కోట్ల మందికి మాతృభాషలో చదవడం, రాయడం రాదు. వీరిలో 15 నుంచి 59 ఏళ్ల మధ్య 81.14 లక్షల మంది ఉంటే, 59ఏళ్లు దాటిన వారు 39.54 లక్షల మంది ఉన్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 7.38 లక్షల మంది, అనంతపురంలో 6.09 లక్షల మంది, పల్నాడులో 6.09 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. అత్యల్పంగా పార్వతీపురం మన్యంలో 2.90 లక్షల మంది, అంబేడ్కర్‌ కోనసీమలో 2.97 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 96.71 లక్షల మంది నిరక్షరాస్యులుంటే, పట్టణ ప్రాంతాల్లో 23.97 లక్షల మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 58.01 లక్షల మంది మహిళలు, పురుషులు 38.69 లక్షల మంది, పట్టణాల్లో 15.32 లక్షల మంది మహిళలు, 8.64 లక్షల మంది పురుషులు నిరక్షరాస్యులుగా ఉన్నారు.

జగన్‌ సర్కారు నిర్లక్ష్యం

వయోజనుల్లో అక్షరాస్యతను పెంచే కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గత ఐదేళ్లలో కేవలం 3లక్షల మందిని మాత్రమే అక్షరాస్యులుగా మార్చారు. ఫలితంగా అక్షరాస్యతలో దేశంలోనే ఏపీ చివరి స్థానంలో నిలిచింది. 2023-24లో నిర్వహించిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వేలో ఈ విషయం తేలింది. అప్పటికి మిజోరం అత్యధికంగా 98.2 శాతంతో అగ్రస్థానంలో నిలి స్తే, 72.6 శాతంతో ఏపీ చివరన ఉండిపోయింది. బిహార్‌ (74.3%), మధ్యప్రదేశ్‌ (75.2%), రాజస్థాన్‌ (75.8%) ఏపీ కంటే ముందున్నాయి. 2024-25లో కూటమి ప్రభుత్వం 3.95 లక్షల మంది వయోజనులకు శిక్షణ ఇచ్చి, 3.53 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చింది.

దశల వారీగా మార్చడమే లక్ష్యం

15 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న 81,14,598 మందిని దశల వారీగా అక్షరాస్యులుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. 2025-26లో 25 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించాం. ఆగస్టు నుంచి అక్షరాంధ్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది.

- కృతికా శుక్లా, వయోజన విద్యాశాఖ, డైరెక్టర్‌

Updated Date - Jul 03 , 2025 | 03:39 AM