ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Savitha: హాస్టళ్ల పర్యవేక్షణకు ఏఐ

ABN, Publish Date - Jul 24 , 2025 | 04:26 AM

కృత్రి మ మేథతో(ఏఐ) బీసీ హాస్టళ్ల పర్యవేక్షణ చేపట్టనున్నాం. త్వరలోనే అందుకు ఒక యాప్‌

త్వరలో అందుబాటులోకి యాప్‌

  • బాబు స్ఫూర్తితో వసతి గృహాలకూ పీ 4

  • మార్గదర్శకులను గుర్తించి దత్తత ఇస్తాం

  • స్వచ్ఛాంధ్ర నిధులతో మరుగుదొడ్లు

  • అధికారుల నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి

  • బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షలో మంత్రి సవిత

అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): ‘కృత్రి మ మేథతో(ఏఐ) బీసీ హాస్టళ్ల పర్యవేక్షణ చేపట్టనున్నాం. త్వరలోనే అందుకు ఒక యాప్‌ రూపొందించనున్నాం. సీఎం చంద్రబాబు స్ఫూ ర్తితో బీసీ హాస్టళ్ల అభివృద్ధికి పీ 4 మోడల్‌ అమలు చేయనున్నాం. మార్గదర్శకులను గుర్తించి బీసీ హాస్టళ్లను దత్తత ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం’ అని మంత్రి ఎస్‌ సవిత తెలిపారు. విజయవాడలో బుధవారం ఆయా జిల్లాల బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ఏఐతో బీసీ హాస్టళ్ల జవాబుదారీతనం మరింత పెరుగుతుంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ నిధులతో నిర్మిస్తున్న మరుగుదొడ్లును వచ్చే నెల 30లోగా పూర్తి చేయాలి. బీసీ హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. అడ్మిషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలి. 5లోగా నిర్దేశిత లక్ష్యం మేర అడ్మిషన్లు పూర్తి చేయాలి. ముఖ ఆధారిత గుర్తింపు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) ద్వారా విద్యార్థుల హాజరులో ఆటంకాలు ఏర్పడితే ఉన్నతాధికారులతో చెప్పి సమస్య పరిష్కరించుకోవాలి. బీసీ హాస్టళ్ల అభివృద్ధికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. దీనిలో భాగంగానే గత ప్రభుత్వం పెట్టిన డైట్‌ బిల్లుల బకాయిలు చెల్లించడమే కాకుండా ఎప్పటికప్పుడు డైట్‌ బిల్లులు చెల్లిస్తున్నాం. హాస్టళ్లలో రాత్రి సమయాల్లో సంక్షేమ అధికారులు ఉండాల్సిందే. హాస్టళ్ల పనితీరు మరింత మెరుగుపడాలంటే నిరంతర పర్యవేక్షణ అవసరం. మంత్రిగా నేను అన్ని జిల్లాల్లోని బీసీ హాస్టళ్లను, గురుకులాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నా. జిల్లా స్థాయి అధికారులు తరచూ హాస్టళ్లను సందర్శించాలి. వీలుచేసుకొని రాత్రిళ్లు బస చేయాలి. దీనికోసం ఒక టూర్‌ డైరీ రూపొందించాలి. ఆ డైరీని ప్రతి నెలా 5లోగా రాష్ట్ర కార్యాలయానికి పంపించాలి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టళ్లలో మరమ్మత్తులు చేపట్టాం. ఇందుకోసం రూ.13 కోట్లు వెచ్చిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం’ అని మంత్రి సవిత వివరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డైరక్టర్‌ చంద్రశేఖర్‌ రాజు, ఎంజేపీ స్కూళ్ల కార్యదర్శి మాధవీలత, బీసీ కార్పొరేషన్‌ ఈడీలు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్ల నిర్వహణ తీరుతెన్నులను బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్‌.సత్యనారాయణ వివరించారు.

Also Read:

దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

For More Health News

Updated Date - Jul 24 , 2025 | 04:26 AM