Sri City: శ్రీసిటీలో ఏముందంటే?
ABN, Publish Date - Aug 20 , 2024 | 10:12 PM
2008 ఆగస్టు 8న ప్రారంభించిన శ్రీసిటీ(Sri City) ఏకీకృత వ్యాపార నగరంగా అభివృద్ధి చెందింది. అనతికాలంలోనే ప్రపంచస్థాయి పారిశ్రామిక మౌలిక వసతులను ఏర్పరచుకుంది. అత్యధికంగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించింది. ఇప్పుడు దేశంలోని వివిధ పారిశ్రామిక నగరాల్లో అగ్రగణ్యంగా నిలిచింది.
తిరుపతి: 2008 ఆగస్టు 8న ప్రారంభించిన శ్రీసిటీ(Sri City) ఏకీకృత వ్యాపార నగరంగా అభివృద్ధి చెందింది. అనతికాలంలోనే ప్రపంచస్థాయి పారిశ్రామిక మౌలిక వసతులను ఏర్పరచుకుంది. అత్యధికంగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించింది. ఇప్పుడు దేశంలోని వివిధ పారిశ్రామిక నగరాల్లో అగ్రగణ్యంగా నిలిచింది. గత పదిహేనేళ్ల ప్రగతి ప్రస్థానంలో దాదాపు నాలుగు బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు, 4.5అమెరికన్ బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఎగుమతులతో శ్రీసిటీ దినదినాభివృద్ధి చెందుతోంది.
వివిధ తయారీ రంగాల్లో 30దేశాలకు చెందిన 45 బహుళజాతి కంపెనీలతో సహా మెుత్తం 230కి పైగా ప్రఖ్యాతిగాంచిన పరిశ్రమలకు శ్రీసిటీ నిలయంగా మారింది. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉద్యమంలా సాగుతున్న మేకిన్ ఇండియా చొరవకు శ్రీసిటీ ఒక ప్రేరణగా మారింది. ఇక్కడ ఉన్న అనేక పారిశ్రామిక యూనిట్లు దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఎగుమతులను గణనీయంగా పెంచే నాణ్యమైన ఉత్పత్తుల దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో కరువు మాట వినిపించకూడదు..
దేశానికే కుప్పం రోల్ మోడల్: సీఎం బాబు
నాకు రూ. 2 కోట్లు ఇచ్చి ఆ ఇంట్లో ఉండొచ్చు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 20 , 2024 | 10:12 PM