ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫలించిన చంద్రబాబు ప్రయత్నం..

ABN, Publish Date - Sep 02 , 2024 | 12:59 PM

విజయవాడ: నగరంలోని వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. సింగ్‌నగర్‌లోని బుడమేరు ముంపు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. బాధితులకు స్వయంగా ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. మరో రెండు గంటల్లో అందరినీ క్షేమంగా తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.

విజయవాడ: నగరంలోని వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. సింగ్‌నగర్‌లోని బుడమేరు ముంపు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. బాధితులకు స్వయంగా ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. మరో రెండు గంటల్లో అందరినీ క్షేమంగా తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. దారి పొడవున తమ ఇబ్బందులను చంద్రబాబుకు వరద ముంపు బాధితులు వివరించారు.


సీఎం చంద్రబాబు ప్రయత్నం ఫలించింది. వరద సాయం కోసం పవర్ బోట్స్ పంపాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. దీంతో వెంటనే స్పందించిన కేంద్రం వివిధ రాష్ట్రాల నుంచి పవర్ బోట్స్‌ను విజయవాడకు పంపింది. బోట్స్ ద్వారా సింగ్‌నగర్ ముప్పు ప్రాంతంలో బాధితులకు అధికారులు ఆహారం పంపిణీ చేస్తున్నారు. వరద ముంపులో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకువస్తున్నారు. పునరావాస కేంద్రాలకు వెళ్లే బాధితులకు దుస్తులు ఇవ్వాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.


అక్షయపాత్ర, ప్రైవేటు హోటల్స్, దుర్గగుడి ద్వారా బాధితులకు అధికారులు ఆహారం అందిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు మరోసారి పర్యటిస్తున్నారు. సహాయక చర్యలను చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం సూచనలతో ప్రభుత్వ యంత్రాంగం పరుగులుపెడుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కూలిన ఇంటి గోడ.. కుటుంభసభ్యులు గల్లంతు..

హోంమంత్రి ఇంటిని చుట్టుముట్టిన వరద నీరు..

విజయవాడ -హైదరాబాద్ హైవేపై వరద ఉధృతి

తెలంగాణలో వర్షాలకు 10 మంది మృతి..

బ్యారేజీ డ్యామేజ్ చేయాలని కుట్ర..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 02 , 2024 | 12:59 PM

Advertising
Advertising