కూలిన ఇంటి గోడ.. కుటుంభసభ్యులు గల్లంతు..
ABN, Publish Date - Sep 02 , 2024 | 12:40 PM
ఖమ్మం జిల్లా: కూసుమంచి మండలం, నాయకన్ గూడెం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. వరదలో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుటుంబసభ్యులు గల్లంతయ్యారు. ఒక్కసారిగా పాలేరు రిజర్వాయర్ వరద వారి ఇంటిని చుట్టిముట్టడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వారు ఇంటిపైకప్పు ఎక్కారు.
ఖమ్మం జిల్లా: కూసుమంచి మండలం, నాయకన్ గూడెం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. వరదలో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుటుంబసభ్యులు గల్లంతయ్యారు. ఒక్కసారిగా పాలేరు రిజర్వాయర్ వరద వారి ఇంటిని చుట్టిముట్టడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వారు ఇంటిపైకప్పు ఎక్కారు. రిస్క్యూ టీమ్, పోలీసులు రూలర్ సాయంతో వారికి సేఫ్టీ జాకెట్స్ అందజేశారు. వరద పెరిగి ఇంటిగోడ కూలడంతో తల్లిదండ్రులు షేక్ యాకూబ్, సైదాబీ, కుమారుడు షరీఫ్ గల్లంతయ్యారు.
హాట్య తండా జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద తాడు సాయంతో పోలీసులు షరీఫ్‌ను కాపాడారు. షరీఫ్ తల్లిదండ్రుల కోసం నిన్నటి నుంచి గాలింపుచర్యలు చేపట్టారు. అయినా ఇప్పటి వరకు వారి ఆచూకి లభ్యం కాలేదు. కాగా ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు ఏకధాటిగా పడుతుండటంతో ఖమ్మం నగరంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వాగుకు పై నుంచి వచ్చే నీటి తీవ్రతతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఖమ్మం రూరల్ మండలంలోని జలగంనగర్-ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతాల్లోకి మున్నేరు వరద పోటెత్తింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉండేవారు బయటకు రాలేకపోతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హోంమంత్రి ఇంటిని చుట్టుముట్టిన వరద నీరు..
విజయవాడ -హైదరాబాద్ హైవేపై వరద ఉధృతి
తెలంగాణలో వర్షాలకు 10 మంది మృతి..
బ్యారేజీ డ్యామేజ్ చేయాలని కుట్ర..
అర్ధరాత్రి సింగ్ నగర్ వెళ్ళిన సీఎం చంద్రబాబు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 02 , 2024 | 12:40 PM