తెలంగాణలో వర్షాలకు 10 మంది మృతి..

ABN, Publish Date - Sep 02 , 2024 | 11:36 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కామాండ్ కంట్రోల్ సెంట్రల్‌లో సీఎం చేపట్టనున్న సమీక్షకు వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నారు. తెలంగాణలో వర్షాల కారణంగా ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కామాండ్ కంట్రోల్ సెంట్రల్‌లో సీఎం చేపట్టనున్న సమీక్షకు వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నారు. తెలంగాణలో వర్షాల కారణంగా ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు, సీపీలతో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పంటపొలాలకు జరిగిన నష్టంపై ఆరా తీస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లాల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ కోసం సచివాలయంలో టోల్ ఫ్రీ నెం. 040 - 23454088 ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

బ్యారేజీ డ్యామేజ్ చేయాలని కుట్ర..

అర్ధరాత్రి సింగ్ నగర్ వెళ్ళిన సీఎం చంద్రబాబు..

రాత్రంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు..

ఖమ్మంలో కుండపోత వర్షాలు.. ఉధృతంగా మున్నేరు వాగు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 02 , 2024 | 11:36 AM