రాత్రంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన..
ABN, Publish Date - Sep 02 , 2024 | 08:41 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోరు వానలో ఆదివారం రాత్రి 10. 40 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము 4.19 గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత విజయవాడ సింగ్ నగర్, ఆ తరువాత ఇబ్రహీంపట్నం, ములపాడులో పర్యటించారు. తర్వాత అక్కడినుంచి నేరుగా విజయవాడ కృష్ణలంకలో పర్యటించారు. ప్రకాశం బ్యారేజి వరద 11 లక్షల క్యూసెక్కులకు చేరుకోవడంతో అక్కడి ప్రజలను ధైర్యంగా ఉండాలని చెబుతూ.. అధికారులను అప్రమత్తం చేశారు. బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పారు. నేనున్నాననే భరోసా ఇచ్చారు. సమయం కొంచెం ముందు వెనుక అయినా ప్రతీ ఒక్కరినీ రక్షించి తీరుతామని స్పష్టం చేశారు. సహాయక చర్యలు మరింత వేగవంతం చేస్తామన్నారు. బాధితులకు ఆహారం, పాలు, నీరు, స్నాక్స్ సరఫరా చేశారు. సోమవారం 6 హెలికాప్టర్‌లు వస్తాయని, సహాయక చర్యల్లో పాల్గొంటాయని చంద్రబాబు వెల్లడించారు.
1/9
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోరు వానలో ఆదివారం రాత్రి 10. 40 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము 4.19 గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
2/9
వరద నీటిలో బోటులో ప్రయాణిస్తూ ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు..
3/9
ముఖ్యమంత్రి చంద్రబాబు వరద నీటిలో బోటులో ప్రయాణిస్తూ బాధితులను పరామర్శిస్తున్న దృశ్యం.
4/9
ఆదివారం అర్ధరాత్రి ముంపు ప్రాంతాలను బోటులో ప్రయాణిస్తూ పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు..
5/9
వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్న దృశ్యం..
6/9
వరద బాధితుల కోసం బోటులో నిత్యావసర వస్తువులు తీసుకువెళుతున్న సీఎం చంద్రబాబు...
7/9
బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న రిస్క్యూ సిబ్బంది.. మరోవైపు నేనున్నానంటూ బాధితులకు భరోసా ఇస్తున్న ముఖ్యమంత్రి..
8/9
వరద బాధితులను పరామర్శించి.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబు..
9/9
ఆదివారం రాత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు.. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయన రెస్టు తీసుకున్న బస్సు ఇదే..
Updated at - Sep 02 , 2024 | 08:41 AM