ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gangula Kamalakar: మేము గేట్లు తెరిస్తే కాంగ్రెస్‌లో ఎవ్వరూ మిగలరు

ABN, Publish Date - Jan 04 , 2024 | 11:32 PM

తాము గేట్లు తెరిస్తే కాంగ్రెస్‌ పార్టీలో ఎవ్వరూ మిగలరని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) తెలిపారు. గురువారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అంటున్నారని.. ముందు వాళ్ల నేతలు బీఆర్ఎస్‌లోకి రాకుండా చూసుకోవాలని హితవు పలికారు.

కరీంనగర్: తాము గేట్లు తెరిస్తే కాంగ్రెస్‌ పార్టీలో ఎవ్వరూ మిగలరని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) తెలిపారు. గురువారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అంటున్నారని.. ముందు వాళ్ల నేతలు బీఆర్ఎస్‌లోకి రాకుండా చూసుకోవాలని హితవు పలికారు. రాజగోపాల్‌రెడ్డి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒక నెలలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంత వ్యతిరేకత మూట గట్టుకున్నదని.. పాలన ఎలా చేస్తుందని ప్రశ్నించారు. తమకు కేసీఆర్ దైవ సమానులు ..ఎవ్వరూ బీఆర్ఎస్‌ను వీడరన్నారు. తమకు ప్రభుత్వాన్నికూల్చే ఉద్దేశం లేదన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ మూడుసార్లు ఓడిపోయారని.. అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలిస్తారా అని గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు.

Updated Date - Jan 04 , 2024 | 11:32 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising