Home » Gangula Kamalakar
నగరంలోని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు గంగుల కమలాకర్ కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కార్యాలయం ఇన్‌చార్జి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కరీంనగర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌తో పాటు పాడి కౌశిక్ రెడ్డి కారును బీజేపీ నేతలు ధ్వంసం చేశారు.
క్యాతనపల్లిలో తమపై రాళ్ల దాడి చేశారని.. తనను జైలుకు పంపారని బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారు. క్యాతనపల్లిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని ఆయన కోరారు.
తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శలు గుప్పించారు. బీసీలను మోసం చేశారంటూ సర్కార్‌పై మండిపడ్డారు.
కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై కేసు నమోదు చేయడం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
కాళేశ్వరం డిజైన్, నిర్మాణ నాణ్యతలో లోపాలున్నాయని రిపోర్టులో వెలువడిందని సీఎం రేవంత్ తెలిపారు. అన్నారం బ్యారేజ్‌లో మట్టి అంచనాలు తప్పుగా ఉన్నాయని పేర్కొన్నారు. పనుల పర్యవేక్షణలో కూడా లోపాలున్నాయని విమర్శించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో చేపట్టిన ధాన్యం టెండర్లలో రూ.700కోట్ల నుంచి రూ.1000కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు.
కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు.. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకున్నారు. సునీల్ రావును సస్పెండ్ చేయాలని గంగుల కమలాకర్ వర్గం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. గంగుల కమలాకర్ కంట్రోల్‌లో ఉండాలని, తనపై చిల్లర ఆరోపణలు చేస్తే అందరి చిట్టా విప్పుతానని మేయర్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. శుక్రవారం ఖమ్మంలోని పత్తి మార్కెట్‌కు వచ్చిన ఆయన రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు వేయడం లేదని పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల పేరుతో రైతుల భూములు లాక్కోడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని హరీష్‌రావు అన్నారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శలు చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కులు కూడా కాంగ్రెస్ నేతలే పంచుతున్నారని.. గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.