Share News

బీసీల ఆగ్రహం చూస్తారు.. ప్రభుత్వంపై గంగుల కమలాకర్ ఫైర్

ABN , Publish Date - Mar 20 , 2026 | 03:27 PM

తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శలు గుప్పించారు. బీసీలను మోసం చేశారంటూ సర్కార్‌పై మండిపడ్డారు.

బీసీల ఆగ్రహం చూస్తారు.. ప్రభుత్వంపై గంగుల కమలాకర్ ఫైర్
MLA Gangula Kamalakar

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar) తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీసీలకు కేటాయించాల్సిన రూ.20 వేల కోట్ల బడ్జెట్ ఎటు పోయిందని ప్రశ్నించారు. ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని.. వారిని మోసం చేసిందని ఆరోపించారు. తులం బంగారం ఇస్తామని ఇవ్వకుండా చెవిలో పూలు పెట్టారని విమర్శించారు. ప్రభుత్వ డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.


గతంలో కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చిందని మంత్రి ప్రకటించారని.. ఇప్పుడేమో కేసీఆర్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల బడ్జెట్‌‌లో కోతల విధించారని.. ఇంతలా కోతల విధించిన బడ్జెట్‌ను ఇప్పుడే చూస్తున్నానని విమర్శించారు. బీసీల ఆత్మగౌరవ భూములను లాగే ప్రయత్నాలు చేస్తున్నారని.. బీసీల చెవిలో పువ్వులు పెట్టి మోసం చేశారని ఆరోపించారు. త్వరలోనే బీసీల ఆగ్రహం చూస్తారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు ఎంత కేటాయించారంటే..

తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 03:37 PM