బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు ఎంత కేటాయించారంటే..
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:52 PM
తెలంగాణ బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఆరు గ్యారంటీల అమలుకు మొత్తం రూ.50,713 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలుకు ప్రాధాన్యం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. ఆరు గ్యారంటీల అమలుకు మొత్తం రూ.50,713 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, సన్న వడ్లకు కేటాయింపులు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
కేటాయింపులు ఇవే..
6 గ్యారంటీలకు రూ.50,713 కోట్లు
రైతు భరోసా - రూ.18,000 కోట్లు
చేయూత - రూ.14,861 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు - రూ.5,500 కోట్లు
మహాలక్ష్మి పథకం - రూ.4,305 కోట్లు
సన్న వడ్ల బోనస్ - రూ.3,500 కోట్లు
గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్) - రూ.2,080 కోట్లు
రాజీవ్ ఆరోగ్య శ్రీ - రూ.1,143 కోట్లు
మహాలక్ష్మి పథకం కింద ఎల్‌పీజీ సబ్సిడీ - రూ.723 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా - రూ.600 కోట్లు
పవర్ సబ్సిడీ - రూ.14,000 కోట్లు
బియ్యం సబ్సిడీ - రూ.3,000 కోట్లు
కల్యాణ లక్ష్మి / షాది ముబారక్ - రూ.3,683
విద్యార్థుల డైట్ ఛార్జీలు - రూ.2,170 కోట్లు
స్కాలర్‌షిప్‌లు - రూ.4,343 కోట్లు
తప్పనిసరి కార్యాలయ ఖర్చులు - రూ.2,323 కోట్లు
ఇవి కూడా చదవండి...
గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ నిరసన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
మొదలైన తెలంగాణ అసెంబ్లీ.. బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
Read Latest Telangana News And Telugu News