Share News

ఆ గ్రామంలో డీజేలు, ప్రీ-వెడ్డింగ్ షూట్‌లపై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ. 50 వేల జరిమానా

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:27 PM

ఇటీవల శుభకార్యాలు, పండగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో డీజే సౌండ్‌తో దద్దరిల్లుతున్నాయి. దీని వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఆ గ్రామంలో డీజేలు, ప్రీ-వెడ్డింగ్ షూట్‌లపై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ. 50 వేల జరిమానా
Telangana Village Rules

ఆసిఫాబాద్, మార్చి 20: ఇటీవల శుభకార్యాలు, పండగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో డీజే సౌండ్‌తో దద్దరిల్లుతున్నాయి. దీని వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం, ఖైరీగూడ గ్రామస్తులు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో అనవసర ఖర్చులను తగ్గించడంతో పాటు, యువత పెడదోవ పట్టకుండా ఉండేందుకు కఠిన నిబంధనలను విధిస్తూ సామూహికంగా తీర్మానం చేశారు.


సాధారణంగా పెళ్లిళ్లు లేదా శుభకార్యాల సమయంలో అట్టహాసంగా నిర్వహించే ప్రీ-వెడ్డింగ్ షూట్లు (Pre-wedding shoot), హల్తీ వేడుకలపై ఖైరీగూడ గ్రామస్తులు నిషేధం విధించారు. వీటి వల్ల అనవసరంగా డబ్బు వృథా కావడమే కాకుండా, సామాజికంగా కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగు, అర్థరాత్రి వరకు హోరెత్తించే డీజే (DJ) సౌండ్ సిస్టమ్స్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సభలో ఏకీగ్రీవంగా ఆమోదించిన ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే, వారికి రూ.50,000 జరిమానా విధించాలని తీర్మాణం చేశారు. గ్రామస్తుల ఆరోగ్యం, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని, గ్రామంలో మద్యం విక్రయాలను, నాటు సారా తయారీని పూర్తిగా నిషేధించారు. ఈ నిబంధనలు గ్రామంలో ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని, ఎవరికీ మినహాయింపు ఉండదని తీర్మాణంలో స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

మహిళల అక్రమ రవాణా.. ఇద్దరిని రక్షించిన పోలీసులు

ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 12:30 PM