ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి
ABN , Publish Date - Mar 20 , 2026 | 10:25 AM
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటోను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
మహబూబాబాద్, మార్చి 20: జిల్లాలోని మరిపెడ మండలం సీతారాం తండా స్టేజ్ వద్ద ఈరోజు(శుక్రవారం) ఉదయం రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శుభకార్యానికి ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. ఆటోను బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో తొమ్మిది మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అలాగే మరో ఏడుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం
మహిళల అక్రమ రవాణా.. ఇద్దరిని రక్షించిన పోలీసులు
Read Latest Telangana News And Telugu News