డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం
ABN , Publish Date - Mar 20 , 2026 | 07:48 AM
అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రాణాలకు ప్రమాదం అని అధికారులు ఎంతగా చెబుతున్నా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. అతివేగం ముగ్గురి నిండు ప్రాణాలను బలితీసుకుంది.
అన్నమయ్య జిల్లా, మార్చి20: అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రాణాలకు ప్రమాదం అని అధికారులు ఎంతగా చెబుతున్నా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో కురుబల కోట మండల పరిధిలో గురువారం రాత్రి జరిగిన ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కురుబల కోట మండలం సర్కారుతోపు సమీపంలో జరిగిన బైక్ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బి.కొత్తకోటకు చెందిన సురేంద్రతో పాటు మదనపల్లికి చెందిన మాధవ, మహేశ్ ముగ్గురు స్నేహితులు. గురువారం రాత్రి పని నిమిత్తం మదనపల్లికి వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో, పట్టణ శివారులోని అమ్మచెరువుమిట్ట దాటిన తర్వాత జాతీయ రహదారిపై బైక్ నియంత్రణ కోల్పోవడంతో డివైడర్‌ను బలంగా ఢీ కొట్టారు. దీంతో బైక్ పై ఉన్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
ఆ కంటి మందుకు అనుమతుల్లేవు