వీధుల్లో కుక్కల స్వైర విహారం
ABN , Publish Date - Mar 20 , 2026 | 10:11 AM
గతంలో వీధి కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసిన తరువాత వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో తిరిగి అక్కడనే వదిలిపెట్టేవారు.
న్యాయస్ధానం ఆదేశాలు జారీ చేసినా రాని మార్పు
సికింద్రాబాద్: గతంలో వీధి కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసిన తరువాత వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో తిరిగి అక్కడనే వదిలిపెట్టేవారు. కానీ ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకరావద్దంటూ అత్యున్నత న్యాయస్థానం గతేడాది నవంబరు 7న అధికారులను ఆదేశించింది. విపరీత ప్రవర్తన కలిగిన వీధి కుక్కలను గుర్తించి వెంటనే షెల్టర్లకు తరలించి సంతాన నియంత్రణ చికిత్సలు చేయాలని సూచించింది. వాటికి ప్రత్యేక ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి, బస్సు, రైల్వేస్టేషన్‌లు, ఆస్పత్రులు, విద్యా సంస్థలు, స్పోర్ట్స్ గ్రౌండ్‌లోకి ప్రవేశించకుండా ఫెన్సింగ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. కానీ కుక్కల నియంత్రణకు అధికారులు తీసుకుంటున్న చర్యల్లో పురోగతి కనిపించకపోవడం విమర్శలకు తావిస్తుంది.
రోజుకు 12 నుంచి 20 ఫిర్యాదులు
జీహెచ్‌ఎంసీలో శివారు నగరపాలక, పురపాలక సంఘాలను విలీనం చేయడానికి ఐదేళ్ల ముందు నుంచే గాజులరామారంలో వీధి కుక్కల సంరక్షణ కేంద్రం కొనసాగుతుంది. అప్పటి వరకు ఈ కేంద్రం పరిధిలో అల్వాల్ సర్కిల్ ఉండేది. వీధి కుక్కలకు ఇక్కడే వ్యాధి నిరోధక టీకాలు, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలను నిర్వహించేవారు. విలీనం తరువాత మల్కాజిగిరి(Malkajgiri) జోనల్ కార్యాలయం కొత్తగా ఆవిర్భవించింది. దీంతో ప్రస్తుతం అల్వాల్ ఎల్‌బీనగర్‌లోని ఫతుల్లాగూడకు పంపిస్తున్నారు.
ఇక్కడ కూడా అల్వాల్ నుంచి ప్రతి రోజు 20 ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. అల్వాల్, మచ్చబొల్లారం, వెంకటాపురం డివిజన్ పరిధిలో పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కొన్ని చోట్ల కుక్కలు ఖాళీ ప్రదేశాల్లో ప్రసవిస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన పిల్లలతో పాటు శునకాలు రహదారులపైనే తిష్ట వేస్తుండటంతో ఇళ్లల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News