Share News

మహిళల అక్రమ రవాణా.. ఇద్దరిని రక్షించిన పోలీసులు

ABN , Publish Date - Mar 20 , 2026 | 09:40 AM

మహిళలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు విక్రయించిన ఇద్దరు మహిళను పోలీసులు రక్షించారు.

మహిళల అక్రమ రవాణా.. ఇద్దరిని రక్షించిన పోలీసులు
Human Trafficking

కొమురం భీం ఆసిఫాబాద్, మార్చి 20: జిల్లాలో మహిళల అక్రమ రవాణా తీవ్ర కలకలం రేపుతోంది. బెజ్జూరు మండలానికి చెందిన ఇద్దరు మహిళలను మాయమాటలు చెప్పి ఉత్తరాది రాష్ట్రాలకు తరలించి విక్రయించిన దళారుల ముఠా గుట్టు బయటపడింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. త్వరితగతిన మహిళలను గుర్తించి వారిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.


మహిళల అక్రమ రవాణాకు సంబంధించి పలువురు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళల అక్రమ రవాణా ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి...

ఫేస్‌బుక్‌లో భార్య ‘సిమెంట్‌ ఔర్‌ డ్రమ్‌’ పోస్టు!

డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 10:14 AM