ప్రతి రైతుకూ సాయం: అచ్చెన్న
ABN , Publish Date - Mar 20 , 2026 | 06:08 AM
అకాల వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి రైతుకూ సాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: అకాల వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి రైతుకూ సాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. అకాల వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే 3-4 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్లతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతుల్ని అప్రమత్తం చేయాలని అచ్చెన్న చెప్పారు.