నేడు జుమాతుల్ విదా.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Mar 20 , 2026 | 07:19 AM
రంజాన్ నెల ఆఖరి శుక్రవారం (జుమాతుల్ విదా) సందర్భంగా చార్మినార్, మక్కా మసీదు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయని హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయ్‌డేవిస్ ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ సిటీ: రంజాన్ నెల ఆఖరి శుక్రవారం (జుమాతుల్ విదా) సందర్భంగా చార్మినార్, మక్కా మసీదు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయని హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయ్‌డేవిస్(Joy Davis) ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ఆయన సూచించారు.
నయాపూల్ వైపు నుంచి చార్మినార్ వైపుకు వచ్చే వాహనాలను మదీనా జంక్షన్ నుంచి సిటీ కాలేజీ వైపునకు మళ్లిస్తారు. నాగులచింత, శాలిబండ వైపు నుంచి చార్మినార్ వైపునకు వచ్చే వాహనాలను హిమ్మత్‌పురా జంక్షన్ నుంచి హరీబౌలి, ఓల్గా హోటల్ వైపునకు మళ్లిస్తారు.

చౌక్ మైదాన్ నుంచి వచ్చే వాహనాలను కోట్ల అలీజా వైపునకు, మూసాబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలను మోతీగల్లీ, ఫతేదర్వాజా వైపునకు, గుల్జార్‌హౌస్ నుంచి వచ్చే వాహనాలను ఏత్‌బార్ చౌక్ వద్ద నుంచి మీరాలం మార్కెట్, బీబీ బజార్ వైపునకు మళ్లిస్తారు.
షేర్‌ఏ కమాన్ నుంచి వచ్చే వాహనాలను ఘాన్సీ బజార్, హైకోర్టు వైపునకు, లక్కడ్‌కోట్ వైపు నుంచి వచ్చే వాహనాలను మీరాలం మార్కెట్ వైపుకు మళ్లిస్తారు.
నమాజ్‌కు వచ్చే వారు తమ వాహనాలను గుల్జార్‌ఫంక్షన్‌హాల్, మసీద్ ఉల్ అనామ్ గ్రౌండ్, చార్మినార్ బస్ టెర్మినల్, ఏయూ ఆస్పత్రి పార్కింగ్, ఖిల్వత్ గ్రౌండ్, పాత పెన్షన్ ఆఫీస్ వద్ద నిలిపేందుకు స్థలాన్ని కేటాయించారు. సిటీ బస్సులను అఫ్జల్ గంజ్ వద్ద నిలిపి వేస్తారు.
సికింద్రాబాద్ జోన్‌లో..
సికింద్రాబాద్‌లోని సుభాష్ రోడ్‌ను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు మూసివేస్తారు. బాటా ఎక్స్‌రోడ్స్ వైపు నుంచి వచ్చే వాహనాలను మహంకాళి పోలీస్టేషన్ వద్ద నుంచి లాలా టెంపుల్ వైపునకు మళ్లిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News