Share News

పంట నష్టాలు తగ్గించండి: సీఎం

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:42 AM

రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై రైతులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ, అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

పంట నష్టాలు తగ్గించండి: సీఎం

అమరావతి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై రైతులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ, అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తద్వారా పంట నష్టం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, పంట నష్టం జరిగినప్పుడు పూర్తిస్థాయిలో వివరాలు సేకరించాలని చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలతో పంటలకు జరిగిన నష్టంపై గురువారం సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు గాలివానలు, వర్షాలు, వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కృష్ణా, నెల్లూరు, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్‌, అనంతపురం, మన్యం జిల్లాల్లోని 16 మండలాల్లో 89 గ్రామాల్లో వర్షాలతో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అధికారులు సీఎంకు వివరించారు. 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుము పంటకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. మొత్తం 1,215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతినగా, 2,043 మంది రైతులు నష్టపోయినట్లు చెప్పారు. అలాగే అనంతపురం, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని ఉద్యాన పంటలపైనా అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని అధికారులు తెలిపారు.

Updated Date - Mar 20 , 2026 | 05:43 AM