Share News

మొదలైన తెలంగాణ అసెంబ్లీ.. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:11 PM

తెలంగాణ శాసనసభలో 2026-27 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.

మొదలైన తెలంగాణ అసెంబ్లీ.. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
Telangana Assemblys Budget Session

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assemblys Budget Session) ప్రారంభమయ్యాయి. శాసనసభలో 2026-27 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Minister Bhatti Vikramarka) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ పాలన చేస్తున్నామని తెలిపారు. పాలకుల్లా కాకుండా సేవకుల్లా పని చేస్తున్నామన్నారు. గత పాలకులు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తున్నామని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని.. దేశంలో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.


బడ్జెట్ అంటే అంకెల చుట్టూ తిరిగే సంఖ్యలు కాదని మంత్రి తెలిపారు. గొప్పల కోసం తామేమీ అబద్ధాలు చెప్పడం లేదన్నారు. సంక్షేమం, అభివృద్ధి తమకు తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. దేశానికి తెలంగాణ బలమైన గ్రోత్ ఇంజిన్ అని పేర్కొన్నారు. జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణది 2.7 శాతం ఎక్కువన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం 1.9 రెట్లు పెరిగిందని వెల్లడించారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యమని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక సమస్య

గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ నిరసన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 03:06 PM