Share News

హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక సమస్య

ABN , Publish Date - Mar 20 , 2026 | 11:19 AM

హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్‌పేట్ నుంచి రాయదుర్గం మార్గంలో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి.

హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక సమస్య
Hyderabad Metro

హైదరాబాద్, మార్చి 20: నగరంలోని మెట్రో రైలు(Hyderabad Metro) సేవల్లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్‌పేట్ నుంచి రాయదుర్గం మార్గంలో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఈరోజు(శుక్రవారం) ఉదయం టెక్నికల్ సమస్య కారణంగా జూబ్లీ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైలు పట్టాలపై నిలిచిపోయింది. దీంతో రెండు వైపులా (అమీర్‌పేట్ నుంచి రాయదుర్గం వైపు, రాయదుర్గం నుంచి అమీర్‌పేట్ వైపు) మెట్రో సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.


ఈ మార్గంలోని మాదాపూర్, హైటెక్ సిటీ స్టేషన్ల వద్ద రైళ్లు ఆగిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే మెట్రో అధికారులు సాంకేతిక లోపాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఇటీవల కాలంలో మెట్రో రైళ్లలో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో మెట్రో అధికారులపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి

తెలంగాణ వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 01:03 PM