Share News

తెలంగాణ వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం

ABN , Publish Date - Mar 20 , 2026 | 10:40 AM

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

తెలంగాణ వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం
Telangana Cabinet

హైదరాబాద్, మార్చి 20: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్(Telangana Cabinet) సమావేశమైంది. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈసారి బడ్జెట్‌లో విద్య, వైద్యం, సంక్షేమం, ఇరిగేషన్‌కు పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2026- 27 వార్షిక బడ్జెట్‌ను రూ.3,36,000 కోట్ల వరకు ప్రవేశపెడుతున్నారని అంచనా.


ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అంతకుముందు.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రజా భవన్‌లోని నల్ల పోచమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులను పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఇవి కూడా చదవండి...

మహిళల అక్రమ రవాణా.. ఇద్దరిని రక్షించిన పోలీసులు

ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 10:59 AM