Share News

రూ.5 లక్షల జీవితబీమా.. ఈ పథకం ఎప్పటినుంచి అమలు చేయనున్నారంటే..

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:23 PM

తెలంగాణ ప్రజలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రజల కోసం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తీసుకు వస్తున్నట్లు తెలిపారు.

రూ.5 లక్షల జీవితబీమా.. ఈ పథకం ఎప్పటినుంచి అమలు చేయనున్నారంటే..

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ ప్రజల కోసం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తీసుకువస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. ఈ పథకాన్ని జూన్ 2వ తేదీ నుంచి అమలు చేస్తామని ఆయన వివరించారు.


2026-27 వార్షిక బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,24,234 కోట్ల అంచనాలతో రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల కోసం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల మేర ఈ బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ముసలం?

For More TG News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 01:07 PM