హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ముసలం?
ABN , Publish Date - Mar 20 , 2026 | 03:06 AM
దేశంలో రెండో పెద్ద బ్యాంక్ అయిన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో సంక్షోభం తలెత్తింది. బ్యాంకు స్వతంత్ర డైరెక్టర్, పార్ట్ టైమ్ చైర్మన్ అతాను చక్రబర్తి తన పదవులకు రాజీనామా చేశారు.,,,
చైర్మన్ రాజీనామా.. షేరు విల విల
న్యూఢిల్లీ: దేశంలో రెండో పెద్ద బ్యాంక్ అయిన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో సంక్షోభం తలెత్తింది. బ్యాంకు స్వతంత్ర డైరెక్టర్, పార్ట్ టైమ్ చైర్మన్ అతాను చక్రబర్తి తన పదవులకు రాజీనామా చేశారు. విలువలు, నైతికతపై బ్యాంకు యాజమా న్యంతో విభేదించి తాను వైదొలగుతున్నట్టు ఆయన ప్రకటించి అందరినీ విస్మయానికి గురి చేశారు. ఈ అనూహ్య పరిణామం మార్కెట్‌ను దిగ్ర్భాంతికి గురి చేసింది. ఫలితంగా గురువారం బీఎ్‌సఈలో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు షేరు భారీ నష్టానికి గురయింది. అమ్మకాల హోరుతో ఆ షేరు నికరంగా 5.13ు నష్టంతో రూ.799.70 వద్ద ముగిసింది. బ్యాంకు షేర్ల మార్కెట్ విలువ ఒక్క రోజే రూ.65,946 కోట్లు దిగజారింది.
కేకి మిస్త్రీకి పగ్గాలు: చక్రబర్తి రాజీనామాతో హెచ్‌డీఎ్‌ఫసీ మాజీ వైస్ చైర్మన్ కేకి మిస్త్రీని బ్యాంకు మూడు నెలల కాలానికి తాత్కాలిక చైర్మన్‌గా నియమించింది. ఆర్‌బీఐ కూడా వెంటనే ఇందుకు ఆమోదం తెలిపింది. గురువారం నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చింది.
నచ్చకే రాజీనామా చేశా: హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు అనుసరిస్తున్న విధానాలు తాను నమ్మే నైతిక విలువలకు విరుద్ధంగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చక్రబర్తి తన రాజీనామా లేఖలో పేర్కొన్నప్పటికీ అవేమిటో వివరించలేదు. బ్యాంకు డైరెక్టర్ల బోర్డు అత్యవసరంగా సమావేశమై రాజీనామాపై పునఃపరిశీలించాలని చక్రబర్తిని కోరింది. అలాగే బ్యాంకుకు సంబంధించిన ఏ విధానాలు నచ్చలేదో చెప్పాలని కోరింది. రాజీనామా లేఖలో వాడిన భాషను కూడా మార్చాలని అభ్యర్థించింది. ఆయన స్పందించకపోవ డంతో మిస్ర్తీకి తాత్కాలికంగా పగ్గాలు అప్పగించాలని తీర్మానించింది.
మాకు నమ్మకం ఉంది: మరో వైపు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు వ్యాపార విధానాలు, నిర్వహణ విధానాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐ పూర్తి నమ్మకం వ్యక్తం చేశాయి. బ్యాంకు ఆర్థిక పునాదులు అత్యంత బలంగా ఉన్నట్టు తెలిపాయి. ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి.
ఇవి కూడా చదవండి..
భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..
మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..