భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:37 PM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో యుద్ధానికి సంబంధించి పలు వదంతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో యుద్ధానికి సంబంధించి పలు వదంతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హోర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలు వెళ్లేందుకు ఇరాన్ అనుమతి నిరాకరించిందంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ వార్తలన్నీ అసత్యాలని కొట్టి పడేసింది (MEA Iran ships claim fake).
ఇటీవల ఇరాన్‌కు చెందిన మూడు నౌకలను భారత్ స్వాధీనం చేసుకుందని, వాటిని తిరిగి అప్పగించే వరకు భారత్‌కు చెందిన నౌకలను హోర్ముజ్ జలసంధి మీదుగా అనుమతించేది లేదని టెహ్రాన్ చెప్పినట్టు కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌కు చెందిన పలు నౌకలతో పాటు సిబ్బంది కూడా హోర్ముజ్‌లో చిక్కుకుపోయారని, ఈ ప్రభావంతో భారత్‌లో ఇంధన సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉందనేది ఆ వార్తలు సారాంశం (Indian vessels Hormuz Strait news).
సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలో ఉన్న ఈ వార్తలను భారత విదేశాంగ శాఖ కొట్టిపడేసింది (MEA fact check Iran blockade). ఇలాంటి నిరాధార వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయవద్దని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
మార్క్ రూబియో, పీట్ హెగ్సెత్ నివాసాలపై డ్రోన్ల కదలికలు
పశ్చిమాసియాకు వేలాదిగా బలగాలు... యూఎస్ సన్నాహాలు