Share News

మార్క్ రూబియో, పీట్ హెగ్సెత్ నివాసాలపై డ్రోన్ల కదలికలు

ABN , Publish Date - Mar 19 , 2026 | 10:48 AM

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మూడో వారానికి చేరినప్పటికీ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా గుర్తుతెలియని డ్రోన్లు వాషింగ్టన్‌లోని పోర్ట్ మెక్‌నాయర్ సైనిక స్థావరంపై కనిపించినట్టు అధికారులు గుర్తించారు.

మార్క్ రూబియో, పీట్ హెగ్సెత్ నివాసాలపై డ్రోన్ల కదలికలు
Hegseth and Rubio

వాషింగ్టన్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మూడో వారానికి చేరినప్పటికీ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా గుర్తుతెలియని డ్రోన్లు వాషింగ్టన్‌లోని పోర్ట్ మెక్‌నాయర్ సైనిక స్థావరంపై కనిపించినట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో(Marco Rubio), రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseht) నివాసాలు ఉండటం అధికారులను కలవరపాటుకు గురిచేసినట్టు 'వాషింగ్టన్ పోస్ట్' తెలియజేసింది.


అమెరికా సైనిక స్థావరంపై కనిపించిన డ్రోన్‌లు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై అధికారులు ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదు. అయితే అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ యూఎస్ సైనిక స్థావరంపై డ్రోన్ల కదలికలను గుర్తించడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. రూబియో, హెగ్సెత్‌లను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.


కాగా, ఇరాన్ డ్రోన్ దాడులు జరిపే అవకాశం ఉందని గత ఫిబ్రవరిలో కాలిఫోర్నియా పోలీసులను ఎఫ్‌బీఐ అప్రమత్తం చేసింది. అయితే ఏ టార్గెట్‌లపై, ఎప్పుడు దాడులు జరపగవచ్చనేది మాత్రం వెల్లడించలేదు. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజాని, మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌ మరణించడం, ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని, 100 టార్గెట్లపై దాడులు జరుపుతామని ఇరాన్ హెచ్చరించడంతో యూఎస్ భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు.


ఇవి కూడా చదవండి..

పశ్చిమాసియాకు వేలాదిగా బలగాలు... యూఎస్ సన్నాహాలు

హబ్షాన్ గ్యాస్ ఫెసిలిటీ, బాబ్ ఆయిల్ ఫీల్డ్ కార్యకలాపాలు నిలిపివేత

Updated Date - Mar 19 , 2026 | 11:05 AM