Share News

కరీంనగర్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంపై దాడి.. 13 మందిపై కేసు నమోదు

ABN , Publish Date - May 07 , 2026 | 07:04 PM

నగరంలోని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు గంగుల కమలాకర్ కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కార్యాలయం ఇన్‌చార్జి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

కరీంనగర్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంపై దాడి..  13 మందిపై కేసు నమోదు
Attack On Gangula kamalakar Office in karimnagar

కరీంనగర్, మే 07: నగరంలోని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు గంగుల కమలాకర్ కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కార్యాలయం ఇన్‌చార్జి రాజు ఫిర్యాదు మేరకు ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్న 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 189, 191(3), 329(4), 324(4), 292, 351(2) r/w 190 సహా పీడీ యాక్ట్‌ కింద పోలీసులు కేసు కట్టారు.


గురువారం కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, స్థానిక లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్‌పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో స్థానిక బీజేపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గంగుల కార్యాలయానికి చేరుకుని పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నించారు. ఆయన కారుతోపాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.


ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో గంగుల కమలాకర్ కార్యాలయం మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన.. 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 07 , 2026 | 08:27 PM