Share News

వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత

ABN , Publish Date - May 07 , 2026 | 06:12 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 44 మంది తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు.

వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత
Food Poision In East Godavari Dist

అమలాపురం, మే 07: అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 44 మంది తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. దాంతో వారందరిని ఆసుపత్రికి తరలించారు. వారిలో 38 మందిని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మరో ఆరుగురిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.


స్పందించిన ఎమ్మెల్యే, మంత్రి..

ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న వెంటనే కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆయా ఆసుపత్రులకు వెళ్లి.. బాధితులను పరామర్శించారు. ఇదే అంశంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా స్పందించారు. ఈ ఘటనలో బాధితుల ఆరోగ్యంపై ఆయా ఆసుపత్రుల వైద్యులను ఆరా తీశారు.


బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కి వైద్యులు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రితోపాటు స్థానిక ఎమ్మెల్యే ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2026 | 06:34 PM