ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS BJP: తొమ్మిది మందితో బీజేపీ తొలి జాబితా.. పంతం నెగ్గించుకున్న ఈటల.. హైదరాబాద్ నుంచి మాధవీలత పోటీ

ABN, Publish Date - Mar 02 , 2024 | 07:06 PM

రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ(BJP) దూకుడు పెంచింది. అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. కార్యచరణలో భాగంగా శనివారం నాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ హై కమాండ్ విడుదల చేసింది.

హైదరాబాద్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ(BJP) దూకుడు పెంచింది. అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. కార్యచరణలో భాగంగా శనివారం నాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ హై కమాండ్ విడుదల చేసింది. ఈ తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులకు అవకాశం కలిపించింది.

సీనియర్లకు జాక్ పాట్

  1. సికింద్రాబాద్ : కిషన్ రెడ్డి

  2. నిజామాబాద్ : ధర్మపురి అరవింద్

  3. కరీంనగర్ : బండి సంజయ్

  4. భువనగిరి : బూర నర్సయ్య గౌడ్

  5. చేవెళ్ల : కొండ విశ్వేశ్వర్ రెడ్డి

  6. నాగర్ కర్నూల్ : భరత్ ప్రసాద్ పోతుగంటి

  7. జహీరాబాద్ : బీబీ పాటిల్

  8. మల్కాజ్‌గిరి : ఈటల రాజేందర్

  9. హైదరాబాద్ : మాధవీలత

లెక్క తేలేదెప్పుడో..?

  • మహబూబ్‌నగర్ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టిన బీజేపీ అధిష్టానం

  • మహబూబ్‌నగర్ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్ మధ్య తీవ్ర పోటీ

  • రకరకాల ఊహాగానాల మధ్య మల్కాజ్‌గిరి సీటును దక్కించుకున్న ఈటల రాజేందర్

  • మల్కాజ్‌గిరి టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత మురళీధర్‌రావు

  • పార్టీలో చేరిన వెంటనే టికెట్ దక్కించుకున్న బీబీ పాటిల్

  • నాగర్‌కర్నూల్ సీటును తన కుమారుడు భరత్ కు ఇప్పించుకున్న ఎంపీ పీ.రాములు

  • హైదరాబాద్ లో ఓవైసీపై పోటీ చేస్తోన్న మాధావీలత

  • ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకు నిరాశ

పెండింగ్ ఎందుకో..?

ప్రస్తుతం ఉన్న నలుగురు సిట్టింగ్‌ ఎంపీలకు ఈసారి కూడా టికెట్లు ఖరారయ్యాయి. అయితే బీజేపీ హై కమాండ్ వెల్లడించిన తొలి జాబితాలో సోయం బాపురావు పేరు లేకపోవడం గమనార్హం. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలుండగా.. తొలి జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 08 స్థానాల్లో కూడా పలువురి అభ్యర్థుల పేర్లను పరిగణనలోకి తీసుకుంది. ఇందుకోసం.. ఒక్కో సీటుకు రెండేసి పేర్లతో.. మరో జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 02 , 2024 | 07:45 PM

Advertising
Advertising