TG NEWS: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..భయంతో జనం పరుగలు
ABN, Publish Date - Dec 31 , 2024 | 06:58 PM
Hyderabad: హైదరాబాద్‌లోని కొండాపుర్‌లో ఇవాళ(మంగళవారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొండాపూర్‌లోని గేలక్సీ అపార్ట్‌మెంట్స్ 9వ అంతస్తులో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని కొండాపుర్‌లో ఇవాళ(మంగళవారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొండాపూర్‌లోని గేలక్సీ అపార్ట్‌మెంట్స్ 9వ అంతస్తులో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మహిళ బాల్కనీలో ఉండటంతో ప్రమాదం తప్పింది ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి మంటలు వ్యాపించాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎగిసిపడుతున్న మంటలను చూసి భయభ్రాంతులకు గురై ఇంట్లో ఉన్నవారు కిందకు వచ్చేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. . ఘటనస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బాలాపూర్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని బాలాపూర్ పరిధిలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిస్మిల్లా కాలనీలోని ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళలనకు గురయ్యారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. పక్కనున్న వారిని అక్కడ నుంచి దూరంగా పంపించి వేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Happy New Year 2025: ఫుల్ కిక్‌లో మందుబాబులు.. మూడ్రోజుల్లో ఎంత తాగారంటే..
KTR: మరోసారి కాంగ్రెస్ సర్కార్‌పై దుమ్మెత్తిపోసిన కేటీఆర్
Metro Rail: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
For More Telangana And Telugu News
Updated Date - Dec 31 , 2024 | 07:00 PM