ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నీటిపారుదల శాఖలో త్వరలో నలుగురు ఈఎన్‌సీలు

ABN, Publish Date - Sep 10 , 2024 | 04:49 AM

నీటి పారుదల శాఖలో కొత్తగా నలుగురు ఈఎన్‌సీ(ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌)ల నియామకం జరుగనుంది.

  • ఒక సూపర్‌ న్యూమరరీ ఈఎన్‌సీ పోస్టు

  • 22 సీఈ పోస్టులకు 13 ఖాళీ

  • పదోన్నతుల ప్రక్రియను రెండురోజుల్లో

  • పూర్తిచేయాలని మంత్రి ఆదేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : నీటి పారుదల శాఖలో కొత్తగా నలుగురు ఈఎన్‌సీ(ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌)ల నియామకం జరుగనుంది. ప్రస్తుతం ఈఎన్‌సీ(ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌), ఈఎన్‌సీ(రామగుండం), ఈఎన్‌సీ (జనరల్‌) పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆ పోస్టుల్లో ముగ్గురు సీనియర్‌ చీఫ్‌ ఇంజనీర్ల(సీఈ)ను నియమించనున్నారు. అంతేకాకుండా మరో ఈఎన్‌సీ (అంతరాష్ట్ర వ్యవహారాల) కోసం ప్రత్యేకంగా ఒక సూపర్‌ న్యూమరరీ పోస్టును సృష్టించి, అందులో కీలక అధికారిని నియమించేఅవకాశాలున్నాయి. ఈఎన్‌సీ(జనరల్‌)గా పనిచేసిన మురళీధర్‌రావును రాజీనామా చేయాలని ప్రభుత్వం కోరగా... ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆ తర్వా త కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్‌-1లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు/పం్‌పహౌ్‌సల నిర్మాణంలో పాల్గొన్న ఈఎన్‌సీ(రామగుండం) నల్లా వెంకటేశ్వర్లుకు ప్రభుత్వం ఉద్వాసన పలికింది.


మరో ఈఎన్‌సీ(ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌)గా పనిచేస్తున్న బి.నాగేంద్రరావు కొద్దినెలల కిందట పదవీ విరమణ చేశారు. ఆయనకు తాత్కాలిక ప్రాతిపదిక, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో నవంబరు దాకా అవకాశం ఇచ్చారు. అయితే నవంబరు లేదా ఆ మధ్యకాలంలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయన సేవలను నిలుపు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లోనే ప్రకటించింది. అయితే ఉత్తర తెలంగాణకు చెందిన కీలక మంత్రి ఆశీస్సులతో ఆయన ఈఎన్‌సీగా మరికొంత కాలం శాఖలో చక్రం తిప్పాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో 22 చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ) పోస్టులు ఉండగా... 13 ఖాళీగా ఉన్నాయి.


సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(ఎ్‌సఈ)లకు సీఈలుగా, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల(ఈఈ)కు ఎస్‌ఈలుగా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల(డీఈఈ)కు ఈఈలుగా, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకు డీఈఈలుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియను ముందుకు కదిలించనున్నారు. దీనిపై సోమవారం జలసౌధలో నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్‌ నేతృత్వంలో వేసిన కమిటీతో సమావేశమయ్యారు. రెండురోజుల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. పదేళ్లుగా పదోన్నతుల ప్రక్రియ జఠిలంగా మార్చారని, గత ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకుండా నాన్చివేత ధోరణి అనుసరించిందని మంత్రి అధికారులకు గుర్తుచేశారు.

Updated Date - Sep 10 , 2024 | 04:49 AM

Advertising
Advertising