ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: బీఆర్‌ఎస్‌కు అభ్యర్థి దొరకకపోవడం బాధాకరం... రఘునందన్ ఎద్దేవా

ABN, Publish Date - Mar 23 , 2024 | 04:11 PM

Telangana: పది సంవత్సరాలు పాలించిన బీఆర్‌ఎస్‌కు స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరమని బీజేపీ మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. శనివారం జిల్లాలోని మర్కుక్ మండల కేంద్రంలో రంగనాయక స్వామి ఆలయంలో రఘునందన్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, హరీష్‌రావులకు తెలంగాణలో మెదక్ పార్లమెంటు అభ్యర్థికి పోటీ చేయడానికి ఒక్కరు కూడా దొరకలేదా అని ప్రశ్నించారు.

సిద్దిపేట జిల్లా, మార్చి 23: పది సంవత్సరాలు పాలించిన బీఆర్‌ఎస్‌కు (BRS) స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరమని బీజేపీ మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావు (BJP Medak parliamentary candidate Raghunandan Rao) వ్యాఖ్యలు చేశారు. శనివారం జిల్లాలోని మర్కుక్ మండల కేంద్రంలో రంగనాయక స్వామి ఆలయంలో రఘునందన్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, హరీష్‌రావులకు తెలంగాణలో మెదక్ పార్లమెంటు అభ్యర్థికి పోటీ చేయడానికి ఒక్కరు కూడా దొరకలేదా అని ప్రశ్నించారు. డబ్బులు తీసుకుని సీట్లు అమ్ముకుంటారా అని నిలదీశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది అని.. తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు.

Nellore: రాష్ట్రాన్ని బాగు చేసే సరైన నాయకుడు చంద్రబాబు: భువనేశ్వరి

తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టిన బుద్ది రాలేదు ఇంకా వందల కోట్లు తీసుకొని సీట్లు అమ్ముకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గుతో రంగనాయక సాగర్‌లో దూకి చావండి అంటూ విరుచుకుపడ్డారు. ‘‘తెలంగాణ సమాజం మిమ్మల్ని ద్వేషిస్తుంది. మీరన్న.. మీ కుటుంబం అన్న ద్వేషిస్తుంది.. సమాజం ద్వేషం పగగా మారక ముందే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి’’ అంటూ హితవుపలికారు. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి.. ఇంతకు ముందే కరీంనగర్ జిల్లా వ్యక్తిని తెచ్చుకొని మెదక్ జిల్లాను నాశనం చేశారు. ఇప్పుడు ఇంకొక కరీంనగరోడు వస్తుండు నాశనం చేయడానికి. పక్క జిల్లాల పెత్తనం మనకు వద్దు. 610 జీవోఅమలు జరగాలంటే పక్క జిల్లాల పెత్తనం మెదక్ జిల్లాపై వద్దు. పైసల కోసం సీట్లు అమ్ముకుంటున్న బీఆర్‌ఎస్ పార్టీని పార్లమెంట్ ఎలక్షన్‌లో ప్రజలు బొంద పెట్టాలి’’ అంటూ రఘునందన్ రావు పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి..

Kishan Reddy: ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం పెరగాలి

Kavitha: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయం.. నిశితంగా పరిశీలిస్తే..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 04:14 PM

Advertising
Advertising