Abhay Patil: బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జిగా అభయ్ పాటిల్!
ABN, Publish Date - Aug 18 , 2024 | 04:12 AM
తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు
ఇన్‌చార్జిగా అరవింద్ మీనన్
ఏపీలో పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి బాధ్యతలు
తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు
ఇన్‌చార్జిగా అరవింద్ మీనన్
ఏపీలో పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి బాధ్యతలు
హైదరాబాద్, న్యూఢిల్లీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జిగా తరుణ్ ఛుగ్ స్థానంలో అభయ్ పాటిల్‌ను నియమించింది. కర్ణాటకలోని దక్షిణ బెల్గాం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిఽధ్యం వహిస్తున్నారు. తన నియామకాన్ని పాటిల్, ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.
శనివారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సభ్యత్వ నమోదు వర్క్‌షా్‌పలో అభయ్ పాటిల్, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి హోదాలో హాజరయ్యారని పార్టీవర్గాలు తెలిపాయి. బీజేపీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిగా అరవింద్ మీనన్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు.
శనివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర ప్రధాన కార్యాలయంలో నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, రానున్న సంస్థాగత ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై, ఈ నెల 31న కేరళలోని పాలక్కాడ్‌లో జరగున్న బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ సంయుక్త సమావేశంపైనా చర్చించారు. మరోవైపు సెప్టెంబరు 1 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు.
Updated Date - Aug 18 , 2024 | 04:12 AM