ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

De-addiction Centers: మత్తు వదలాలంటే..

ABN, Publish Date - Aug 13 , 2024 | 03:20 AM

రాష్ట్రంలో డ్రగ్స్‌, ఇతర మత్తుపదార్థాల కట్టడి చర్యల్లో భాగంగా.. 26 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్‌ కేంద్రాలను పరిశీలించామని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీజీ న్యాబ్‌) వెల్లడించింది.

  • 26 ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డ్రగ్‌ డీ-అడిక్షన్‌ కేంద్రాల్లో ‘12 ప్యానెల్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ కిట్లు ఉండాలి: టీజీ న్యాబ్‌

  • డ్రగ్స్‌ ఫ్రీ సొసైటీకి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డ్రగ్స్‌, ఇతర మత్తుపదార్థాల కట్టడి చర్యల్లో భాగంగా.. 26 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్‌ కేంద్రాలను పరిశీలించామని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీజీ న్యాబ్‌) వెల్లడించింది. వాటిలో కొన్ని కేంద్రాలు బాగా పనిచేస్తుండగా.. కొన్నింటికి జిల్లా అధికారుల నుంచి ప్రోత్సాహం అవసరమని పేర్కొంది. కొన్ని కేంద్రాలు పూర్తిగా మూతపడ్డాయని.. జిల్లా అధికారులు వాటిని తిరిగి తెరవాల్సి ఉందని తెలిపింది. ఈ 26 కేంద్రాల్లోనూ ‘12 ప్యానెల్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ కిట్లు’ అందుబాటులో ఉంటే.. మాదకద్రవ్యాల బారిన పడినవారిని ముందుగానే గుర్తించే అవకాశం ఉందని అభిప్రాయపడింది.


మాదకద్రవ్యాల రహిత సమాజానికి తాము కట్టుబడి ఉన్నామని.. ఆ కల సాకారం కావాలంటే దానికి ఒక సమగ్ర విధానం ఉండాలని.. మద్యం, గంజాయి, కల్తీకల్లు సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని పేర్కొంది. నిజానికి.. కేంద్ర ప్రభుత్వ నషా ముక్త్‌ భారత్‌ పథకంలో భాగంగా రాష్ట్రంలో 16 డీఅడిక్షన్‌ కేంద్రాలు స్వచ్ఛంద సంస్థల ద్వారా కొనసాగుతున్నాయి. అయితే, వాటిలో 11 సెంటర్లు మాత్రమే పనిచేస్తున్నాయని.. వాటిలోనూ 6 కేంద్రాల్లో సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు లేరని గతంలో టీజీ న్యాబ్‌ చేసిన తనిఖీల్లో వెల్లడైంది. ఆ ఆరు కేంద్రాల్లోనూ రెండు సెంటర్ల పనితీరు సంతృప్తికరంగా లేదని.. చికిత్సకు అవసరమైన సౌకర్యాలు అక్కడ లేవని తేలింది.


దీంతో ఆ ఆరు కేంద్రాల్లోనూ సౌకర్యాలను మెరుగుపరచాలంటూ లేఖలు రాసినట్టు టీజీన్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య గతంలో తెలిపారు. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌లోని ఐదు కేంద్రాలను తిరిగి తెరవాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఇప్పుడు తాజాగా వైద్యారోగ్య శాఖ సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన 26 కేంద్రాల్లో తనిఖీలు చేసిన టీజీ న్యాబ్‌.. వాటిలో ‘12 ప్యానెల్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ కిట్లు’ అందుబాటులో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడింది.

Updated Date - Aug 13 , 2024 | 03:20 AM

Advertising
Advertising
<