ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL: రోజుకు రూ.25 లక్షలు, కామెంటేటర్‌గా రీ ఎంట్రీ

ABN, Publish Date - Mar 19 , 2024 | 05:04 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ వచ్చేస్తోంది. ఐపీఎల్ సీజన్ కోసం క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ అంటేనే క్రేజ్. స్టేడియంలో ఆటగాళ్ల ఫోర్ల మోత, సిక్సులతో చెలరేగిపోతారు. వెంట వెంటనే వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుపై బౌలర్లు ఒత్తిడి పెంచుతారు. చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగే మ్యాచ్‌ల కోసం క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ వచ్చేస్తోంది. ఐపీఎల్ సీజన్ కోసం క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ (IPL) అంటేనే క్రేజ్. స్టేడియంలో ఆటగాళ్ల ఫోర్ల మోత, సిక్సులతో చెలరేగిపోతారు. వెంట వెంటనే వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుపై బౌలర్లు ఒత్తిడి పెంచుతారు. చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగే మ్యాచ్‌ల కోసం క్రికెట్ (Cricket) అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

కామెంటరీ

ఐపీఎల్‌లో కామెంటరీ కూడా ముఖ్యమే. హిందీ, ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడే వ్యాఖ్యతలకు మంచి వేతనం ఇస్తారు. మిగతా టోర్నమెంట్లు, వరల్డ్ కప్‌లతో పోల్చితే ఐపీఎల్‌లో ఒకరోజు కామెంటరీ చేస్తే రూ.25 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కామెంటర్ కూడా. క్రికెట్ తర్వాత కామెంటేటర్‌గా పనిచేశారు. గత పదేళ్ల నుంచి కామెంటరీ చేయడం లేదు. ఈ సమయంలో రాజకీయాల్లో సిద్దు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు షెడ్యూల్ వచ్చింది. అయినప్పటికీ రాజకీయాలు కాకుండా కామెంటరీ చేస్తానని సిద్దూ ప్రకటించారు.

టీ 20 వరల్డ్ కప్

ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే టీ 20 వరల్డ్ కప్ జరగనుంది. సో.. ఆ సీజన్‌‌లో కూడా కామెంటరీ చేసేందుకు సిద్దు ఆసక్తిగా ఉన్నాడు. ఐపీఎల్‌తో రీ ఎంట్రీ ఇస్తే తనను ప్రపంచం చూస్తుందని చెబుతున్నారు. దాంతో తనకు టీ 20 వరల్డ్ కప్‌లో కూడా అవకాశం వస్తుందని ధీమాతో ఉన్నారు. 2022 నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ 20 మ్యాచ్‌ ఆడటం లేదు. ఈ సారి మాత్రం టీ 20 ఆడుతున్నారు.

పదేళ్ల తర్వాత

పదేళ్ల తర్వాత సిద్దు మైక్ పట్టుకొని మాట్లాడబోతున్నారు. ఎగ్జైటింగ్‌గా ఉందా అని మీడియా ప్రతినిధులు సిద్దూని ప్రశ్నించారు. ‘అదేం లేదు.. క్రికెట్ అంటే అభిమానం, అభిరుచి వృత్తిగా మారితే దాని కన్నా గొప్పది మరొకటి ఉండదు. బాతు ఈత కొట్టడం మరచిపోదు, చేపలు నీళ్లలోకి దిగినట్టు.. తాను కామెంటేటర్‌ చేస్తా. టోర్నమెంట్లు, వరల్డ్ కప్, ఐపీఎల్ సీజన్‌లో కామెంటేటర్‌గా పని చేస్తే ఇచ్చే వేతనం వేరు. ఒక్కో టోర్నీకి రూ.60 నుంచి రూ.70 లక్షల వరకు ఇవ్వొచ్చు. ఐపీఎల్‌లో మాత్రం రోజుకు రూ.25 లక్షలు ఇస్తారు. తనకు డబ్బులతో సంతృప్తి రాదు. చేసే పనితో ఆనందంగా ఉంటాను అని’ సిద్దూ వివరించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 05:04 PM

Advertising
Advertising