ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs AFG: బ్యాటర్లకు పండగే.. రెండో టీ20 పిచ్ రిపోర్ట్ ఇదిగో!

ABN, Publish Date - Jan 14 , 2024 | 07:57 AM

Pitch Report: భారత్, అప్ఘానిస్థాన్ జట్లు కీలకమైన రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. ఇప్పటికే మొదటి టీ20 గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా.. రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్ గెలవాలని భావిస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆడనుండడంతో టీమిండియా బలం మరింత పెరగనుంది.

ఇండోర్: భారత్, అప్ఘానిస్థాన్ జట్లు కీలకమైన రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. ఇప్పటికే మొదటి టీ20 గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా.. రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్ గెలవాలని భావిస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆడనుండడంతో టీమిండియా బలం మరింత పెరగనుంది. దీనికి తోడు గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన యశస్వి జైస్వాల్ కూడా రెండో టీ20కి అందుబాటులో ఉండనున్నాడు. మరోవైపు మొదటి టీ20లో ఓడి డీలాపడిన పర్యాటక జట్టు అఫ్ఘానిస్థాన్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. రెండో టీ20 గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని అప్ఘానిస్థాన్ వ్యూహాలు రచిస్తోంది. ఇండోర్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.


కాగా భారత్, అఫ్ఘానిస్థాన్ రెండో టీ20కి ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం అతిథ్యం ఇవ్వనుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ మ్యాచ్ ఎప్పుడు జరిగినా బ్యాటర్లు పండుగ చేసుకుంటారు. ఫ్లాట్‌గా ఉండే వికెట్‌కు తోడు బౌండరీలు చిన్నవి కావడంతో భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. ఈ పిచ్ నుంచి బౌలర్లకు పెదగా సహకారం లభించదు. టీ20ల్లో ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 209గా ఉందంటేనే బ్యాటర్ల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2017లో శ్రీలంకతో ఇక్కడ జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఏకంగా 260 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇండోర్‌లో ఇప్పటివరకు 3 టీ20 మ్యాచ్‌లు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 2 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు ఒకసారి గెలిచాయి. ఇండోర్‌లో మొహాలీలో మాదిరి అతి చలిగా కాకుండా వాతావరణం అహ్లాదకరంగా ఉండే అవకాశముంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు బ్యాటింగ్ పిచ్ కావడంతో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి.

Updated Date - Jan 14 , 2024 | 07:57 AM

Advertising
Advertising