ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: వంట గదిలో ఉక్కపోతకు వినూత్న పరిష్కారం.. ఇతడి అతి తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN, Publish Date - Apr 21 , 2024 | 09:46 PM

కొందరు తెలివిగా ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్యపరిస్తే.. మరికొందరు అతితెలివిగా ఆలోచిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇంకొందరైతే.. అందుబాటులో ఉన్న వస్తువులతో వింత వింత ప్రయోగాలు చేస్తూ నెట్టింట వైరల్ అవుతుంటారు. ఇలాంటి...

కొందరు తెలివిగా ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్యపరిస్తే.. మరికొందరు అతితెలివిగా ఆలోచిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇంకొందరైతే.. అందుబాటులో ఉన్న వస్తువులతో వింత వింత ప్రయోగాలు చేస్తూ నెట్టింట వైరల్ అవుతుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వంట గదిలో ఉక్కపోత సమస్యకు వినూత్నంగా పరిష్కారం కనుక్కొ్న్నాడు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి భోజనం చేసేందుకు వంట గదిలోకి (Kitchen room) వెళ్తాడు. అసలే వేసవి కాలం కావడంతో వంట గదిలో మరింత వేడిగా ఉంటుందనే ఉద్దేశంతో దాన్నుంచి బయటపడేందుకు కాస్త వినూత్నంగా ఆలోచిస్తాడు. చుట్టూ చూసి చివరకు ఎదురుగా ఉన్న టేబుల్ ఫ్యాన్‌తో (Table fan) పరిష్కారం కనుక్కుంటాడు. స్టాండ్‪‌పై ఉన్న టేబుల్ ఫ్యాన్‌ను.. స్టాండ్‌తో సహా తన వీపునకు కట్టేసుకుంటాడు.

Viral Video: నోరూరిస్తున్న పుచ్చకాయ బిర్యానీ.. దీని తయారీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ఫ్యాన్ కింద పడకుండా వైట్ టేపుతో నడుముకు కట్టేసుకుంటాడు. ఇలా వంట గదిలోకి వెళ్లి గరిటెను శుభ్రం చేసి, ప్లేటులో భోజనం పెట్టకుని చాలా సేపు అక్కడే ఉంటాడు. ఫ్యాన్ తిరుగుండడంతో అతడి వెనుక నుంచి చల్లటి గాలి వస్తుంటుంది. ఇలా ఉక్కపోతకు వినూత్న పరిష్కారం కనుగొన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేయడం ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పులి భయపడితే ఎలా ఉంటుందో తెలుసా.. వేట కోసం వెతుకుతుండగా.. ఏనుగు రావడంతో..

Updated Date - Apr 21 , 2024 | 09:46 PM

Advertising
Advertising