ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: డ్రైవర్ ఎంతకీ కిందకు దిగకపోవడంతో అనుమానం.. ఏమైందా అని లోపల చూడగా..

ABN, Publish Date - Apr 23 , 2024 | 04:27 PM

ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యం కారణంగానే జరుగుతుంటాయి. కొందరు తప్పని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అవతలి వారిని ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇంకొందరు రోడ్డుపై చిత్రవిచిత్ర పనులు చేస్తూ ట్రాఫిక్ జామ్‌కి కారణమవుతుంటారు. ఇలాంటి...

ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యం కారణంగానే జరుగుతుంటాయి. కొందరు తప్పని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అవతలి వారిని ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇంకొందరు రోడ్డుపై చిత్రవిచిత్ర పనులు చేస్తూ ట్రాఫిక్ జామ్‌కి కారణమవుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డు మధ్యలో ఎక్సకవేటర్‌ ఉండడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఏమైందా అని కొందరు ఎక్సకవేటర్‌ సమీపానికి వెళ్లి పరిశీలించారు. చివరకు డ్రైవర్ చేస్తున్న నిర్వాకం తెలుసుకుని షాక్ అయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న రోడ్డు మధ్యలో ఓ ఎక్సకవేటర్ (jcb excavator) ఆగి ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఏమైనా రిపేర్ అయ్యిందేమో అనుకుని చాలా మంది వాహనదారులు.. పక్క నుంచి వెళ్లిపోయారు. అయితే ఎంత సేపటికీ ఆ వాహనం నుంచి డ్రైవర్ కిందకు దిగకపోవడంతో కొందరికి అనుమానం వచ్చింది. ఇంకీ ఏమై ఉంటుందీ... అని అనుకుంటూ సమీపానికి వెళ్లారు. ఎక్సవేటర్ ఇంజిన్ పైకి ఎక్కి లోపల చూడగా.. డ్రైవర్ తాపీగా పడుకుని ఉన్నాడు.

Viral Video: వంట గదిలో ఉక్కపోతకు వినూత్న పరిష్కారం.. ఇతడి అతి తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..

వాహనదారులు సమీపానికి వెళ్లగానే.. వారి వైపు నవ్వుతూ చూస్తూ.. ‘‘మంచి నిద్రలో ఉంటే.. చెడగొడుతున్నారేంటీ’’.. అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. నిద్రపోవడం కోసం వాహనాన్ని రోడ్డు మధ్యలో ఆపడం చూసి మిగతా వాహనదారులంతా ఖంగుతిన్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తులకు ఇండియాలో కొదవే లేదు’’.. అంటూ కొందరు, ‘‘వీడేంటీ.. ఇంత మంది ఇబ్బంది పడుతున్నా.. ఎంత రిలాక్స్‌గా ఉన్నాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఐబ్రోస్ చేయించుకునేందుకు బ్యూటీపార్లర్‌కు వెళ్లింది.. అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో అక్కడే..

Updated Date - Apr 23 , 2024 | 05:35 PM

Advertising
Advertising