Share News

Viral Video: ఐబ్రోస్ చేయించుకునేందుకు బ్యూటీపార్లర్‌కు వెళ్లింది.. అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో అక్కడే..

ABN , Publish Date - Apr 23 , 2024 | 03:32 PM

ప్రస్తుత యువత ఫిట్‌నెస్ ఎంత శ్రద్ధ వహిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక యువతులైతే.. తమ అందాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు బ్యూటీపార్లర్లకు క్యూ కడుతుంటారు. హెయిర్ స్టైల్, ఫేషియల్ ఇలా ప్రతీదీ ఖర్చులకు వెనుకాడకుండా తమకు నచ్చిన విధంగా చేయించుకుంటుంటారు. ఇందులో...

Viral Video: ఐబ్రోస్ చేయించుకునేందుకు బ్యూటీపార్లర్‌కు వెళ్లింది.. అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో అక్కడే..
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత యువత ఫిట్‌నెస్ ఎంత శ్రద్ధ వహిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక యువతులైతే.. తమ అందాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు బ్యూటీపార్లర్లకు క్యూ కడుతుంటారు. హెయిర్ స్టైల్, ఫేషియల్ ఇలా ప్రతీదీ ఖర్చులకు వెనుకాడకుండా తమకు నచ్చిన విధంగా చేయించుకుంటుంటారు. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా పెద్ద పెద్ద గొడవలు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఐబ్రోస్ చేయించుకునేందుకు బ్యూటీపార్లర్‌కు వెళ్లిన యువతి.. అపాయింట్‌మెంట్ దొరక్కపోడంతో చివరకు ఏం చేసిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన చికాగోలో (Chicago) జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ యువతి ఐబ్రోస్ చేయించుకోవడానికి బ్యూటీపార్లర్‌కు (Beauty parlour) వెళ్లింది. అయితే అప్పటికే అక్కడ చాలా మంది ఉండడంతో సదరు యువతికి అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఎలాగైనా తనకు ట్రీట్‌మెంట్ చేయాలని బ్యూటీపార్లర్ నిర్వాహకురాలిని బ్రతిమాలుకుంది. అయినా ఆమె వీలు లేదు, తర్వాత రావాలని చెప్పడంతో సదరు యువతికి కోపం కట్టలు తెంచుకుంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. అయినా యువతికి ట్రీట్‌మెంట్ చేయకపోవడంతో చివరకు వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ఆ యువతికి కోపం ఏమాత్రం తగ్గలేదు.

Viral Video: వంట గదిలో ఉక్కపోతకు వినూత్న పరిష్కారం.. ఇతడి అతి తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..

బ్యూటీపార్లర్ బయటకు రాగానే.. ఆమెకు నిర్వాహకురాలికి సంబంధించిన కారు కనిపించింది. దాన్ని చూడగానే ఆమె కోపం మరింత పెరిగింది. వెంటనే దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. నిప్పు అంటించగానే ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. యువతి చేసిన పనికి షాక్ అయిన బ్యూటీషియన్ మార్సెల్లా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇప్పుడు యువతికి కోర్టుకు అపాయింట్‌మెంట్ దొరుకుతుంది’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో..! ఈమేంటీ పెద్ద సైకోలా ఉందే’’.. అంటూ మరికందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పులి భయపడితే ఎలా ఉంటుందో తెలుసా.. వేట కోసం వెతుకుతుండగా.. ఏనుగు రావడంతో..

Updated Date - Apr 23 , 2024 | 03:32 PM