ఏబీసీ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
ABN, Publish Date - Dec 21 , 2024 | 08:24 AM
యాపిల్, బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
యాపిల్‌లోని విటమిన్ ఎ, బి1, బి2, బి6 తదితరాలు జీర్ణక్రియతో పాటూ గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
బీట్‌రూట్‌లోని ఫొలేట్, మాంగనీస్, పొటాషియం తదితరాలు రక్తప్రసరను మెరుగుపరుస్తాయి.
క్యారెట్‌లోని ఫైబర్, బీటా కెరోటిన్ తదితరాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మలబద్ధకం నివారించడంలోనూ ఈ జ్యూస్ బాగా పని చేస్తుంది.
ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటికి వెళ్లి కాలేయం శుభ్రంగా ఉంటుంది.
చర్మ కణజాలాలను రిపేర్ చేయడంలోనూ ఈ జ్యూస్ దోహదం చేస్తుంది. కండరాలకు రక్త ప్రస్తరణ, ఆక్సిజన్ బాగా అందేలా చేస్తుంది.
ఈ జ్యూస్ తాగడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
Updated Date - Dec 21 , 2024 | 08:49 AM