ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: నారాయణపేటలో కాంగ్రెస్ జన జాతర సభ దృశ్యాలు..

ABN, Publish Date - Apr 16 , 2024 | 08:00 AM

మహబూబ్‌నగర్: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా, నారాయణపేటలో సోమవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జన జాతర సభ జరిగింది. సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై.. ప్రసంగించారు. ఎన్నికల కోడ్‌ కారణంగా రాష్ట్రంలోని 68 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేకపోయామని, ఆగస్టు 15వ తేదీలోపు వారందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే పంట నుంచి రూ.500 బోనస్‌ ఇచ్చి పండిన చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. ‘‘తన బిడ్డ బెయిల్‌ కోసం మాజీ సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ను బీజేపీకి తాకట్టు పెట్టారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం మోదీతో చీకటి ఒప్పందం చేసుకుని సుపారీ తీసుకున్నారు. మహబూబ్‌నగర్‌, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, జహీరాబాద్‌, భువనగిరి లోక్‌సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు. అందుకే.. ఆయా నియోజకవర్గాల పరిధిలో మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ గ్రామాలకు వెళ్లి బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కూడా అడగడం లేదు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

1/6

పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా, నారాయణపేటలో సోమవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన జన జాతర సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం.

2/6

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నారాయణపేటలో కాంగ్రెస్ నేతలు మేకపిల్లను బహూకరిస్తు్న్న దృశ్యం.

3/6

మహబూబ్‌నగర్ జిల్లా, నారాయణపేటలో సోమవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన జన జాతర సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రక్కన మహబూబ్‌నగర్ జిల్లా ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి తదితరులు..

4/6

నారాయణపేట జన జాతర సభలో మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి పేరును మరోసారి ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి...

5/6

నారాయణపేట జన జాతర సభలో ప్రసంగిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి..

6/6

పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా, నారాయణపేటలో సోమవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన జన జాతర సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు

Updated Date - Apr 16 , 2024 | 08:00 AM

Advertising
Advertising