Lokesh: కోయంబత్తూరులో లోకేష్ ఎన్నికల ప్రచారం..
ABN, Publish Date - Apr 12 , 2024 | 01:04 PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలైకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కావడంతో తమిళనాడుకు చెందిన బీజేపీ విభాగం అక్కడి తెలుగు వారి కోసం లోకేష్‌ను ఆహ్వానించింది. తమిళనాడులో ఎక్కువగా తెలుగువారు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులకు మద్దతుగా లోకేష్‌తో బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది. అందుకోసం లోకేష్ గురువారం సాయంత్రం కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు.
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామికి మద్దుతుగా ప్రచారానికి వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. తెలుగు ప్రజలకు నమస్కరిస్తున్న దృశ్యం.
తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన నారా లోకేష్‌కు శాలువ కప్పి సన్మానిస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామి
చేయీ చేయి కలుపుతూ.. కోయంబత్తూరులోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ నేత నారా లోకేష్, బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామి..
తమిళనాడులోని కోయంబత్తూరులో ఎక్కువగా తెలుగువారు ఉండే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి అన్నామలైకు మద్దతుగా లోకేష్ ప్రసంగిస్తున్న దృశ్యం.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కోయంబత్తూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలై ప్రసంగిస్తున్న దృశ్యం. ప్రక్కన నారా లోకేష్‌ను చూడవచ్చు.
కోయంబత్తూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలైకు మద్దుతుగా నారా లోకేష్ నిర్వహించిన రోడ్ షోకు భారీగా తరలి వచ్చిన జనసందోహం..
తమిళనాడులోని కోయంబత్తూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలైకు మద్దుతుగా ప్రచారం నిర్వహించిన లోకేష్.. అక్కడి తెలుగు ప్రజలను పరామర్శించి షేక్ హ్యాండ్ ఇస్తున్న దృశ్యం
Updated Date - Apr 12 , 2024 | 01:04 PM