ఏపీకి తరలుతున్న ఓటర్లు..
ABN, Publish Date - May 11 , 2024 | 11:51 AM
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఉంటున్న ఆంధ్రా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏపీకి తరలి వెళుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు, ఎన్నికల నేపథ్యంలో వేలమంది జనం ఊరి బాట పట్టడంతో మహాత్మాగాంధీ, జూబ్లీబస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. అలాగే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళుతున్న వాహనాలతో చౌటుప్పల్లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ నెలకొంది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఉంటున్న ఆంధ్రా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏపీకి బస్సులు, కార్లలో తరలి వెళుతుండడంతో ఎస్ఆర్ నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యం.
ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వేసేందుకు వెళుతున్న ఏపీ ప్రజలు.. హైదరాబాద్, ఎస్ఆర్ నగర్ వద్ద బస్సుల కోసం ఎదురు చూస్తున్న జనం..
యాదాద్రి భువనగిరి జిల్లా,చౌటుప్పల్‌లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్.. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళుతున్న వాహనాలు
తెలంగాణలో ఉంటున్న ఆంధ్రా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కుటుంబాలతో ఏపీకి తమ వాహనాల్లో తరలివెళుతున్న దృశ్యం..
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళుతున్న వాహనాలతో పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో కంట్రోల్ చేస్తున్న టోల్ ప్లాజా సిబ్బంది..
Updated Date - May 11 , 2024 | 11:54 AM